పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అహం దెబ్బతినకూడదు. ప్రతివాడికి నేను మొనగాణ్ణి అనే భావం వుంటుంది.

12. విమర్శనాపూర్వకంగా మాట్లాడకూడదు

కొంతమందికి అహంభావం, డాబుసరి ఎక్కువ. సొంతడబ్బా goryס వాయించుకొంటారు. వీళ్లు తేలికగా ఇతరులను తెగడుతూ మాట్లాడతారు. ఎవరూ అడగక పోయినా ఇతరుల లోపాలను ఎత్తిచూపిస్తారు. పేదవాళ్లనూ తక్కువ కులాలవాళ్లనూ హేళన చేస్తూ మాట్లాడతారు. స్త్రీలను చులకన చేస్తారు. అనవసరమైన కామెంట్సు విసురుతారు. నరులకు భిన్నాభిప్రాయాలూ, భిన్నమైన జీవిత విధానాలూ వుంటాయి. ఇతరుల పద్ధతులు మనకు నచ్చకపోవచ్చు. అంతమాత్రం చేతనే వాళ్లు తప్పచేసినట్లు కాదు గదా! కనుక తేలికగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు. దానివల్ల మనమే పల్చనై పోతాం.


13. హుందాగా నిప్ర్కమించాలి
నల్గురు కలిసినప్పడు కొన్నిసార్లు సంభాషణ బాగా దిగజారిపోతుంది. ఆత్మస్తుతి, పరనింద పెరిగిపోతాయి. ఆలాంటి సందర్భంలో మనం హుందాగా నిప్ర్కమించడం మెరుగు. మనం వెళ్లిపోయాక మిగిలినవాళ్లు చెత్త మాట్లా డుతున్నామని గ్రహిస్తారు. విందుల్లో పాల్గొనేటప్పుడు కూడ ముందుగానే భోజనం ముగించి లేచిపోవడం ఉత్తమం. అదేపనిగా తింటూ కూర్చుండి లేచిపోయే వాళ్లల్లో కడపటివాళ్లం కాకూడదు.

14. ఆశావాదులతోనే స్నేహం

ఆరు నెలల సావాసం వల్ల వాళ్లు వీళ్లవుతారు అనే సామెత వుంది. ఎప్పడూ తోడివాళ్లు మనలనూ, మనం తోడివాళ్లనూ ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే వుంటాం. అందుచే మనం ఏలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామా అని కూడ పరిశీలించి చూచుకోవాలి. వీలైనంత వరకు ఆశావాదులతోనే కలవాలి. వాళ్లకు ఉన్నతమైన భావాలు ఉంటాయి. మనలను ప్రోత్సహించి పనికి పురికొల్పుతారు. మంచిమార్గం చూపిస్తారు. నిరాశావాదుల దగ్గరికి