పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. హాస్యప్రీతి :

హాస్య ప్రీతి మంచిది. నవ్వించే మాటలు ఎవరైనా ప్రీతితో వింటారు. కాని ఈ గుణం మితిమీరి వెకిలితనంగా మారకూడదు. విదూషకుళాగ ప్రవర్తించకూడదు. హాస్యం చేతగానప్పడు గంభీరంగా వుండడమే మంచిది. గంభీర స్వభావుణ్ణి ప్రజలు గౌరవిస్తారు.

9. పుకార్లు పుట్టించకూడదు

కాలక్షేపానికీ, మానసిక విశ్రాంతికీ ఇరుగుపొరుగువాళ్ల దగ్గరికి వెళ్తాం. ఏవేవో కబుర్లు చెప్తాం. వింటాం గూడ. కాని ఈ సందర్భంలో ఇతరులను అడిపోసుకో గూడదు. ఉన్నవి లేనివి కల్పించకూడదు. పుకార్లు పట్టించకూడదు. అదే పనిగా ఇతరులను గూర్చి చెడ్డగా మాట్లాడితే ప్రజలు మనలను నమ్మరు. రేపు తమ్మ గూర్చి కూడ వదంతులు కల్పిస్తారని భయపడతారు. కొందరికైతే ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా ముట్టించే గుణం వుంటుంది. ఈ చెడ్డ అలవాటుని అవశ్యం సవరించుకోవాలి.

10. ఇతరులను మెచ్చుకోవాలి.

ప్రతి వొక్కరిలో ఏదోవొక సుగుణం వుంటుంది. కొందరు కష్టపడి పనిచేస్తారు. కొందరికి నిజాయితీ లేక మాటకారి తనం వుంటుంది. ఈలాగే యితర సుగుణాలు కూడ తగిన సమయంలో ఎదుటి వ్యక్తిలోని మంచి గుణాన్ని పేర్కొని అతన్ని పొగడాలి. దానివల్ల అతనికి ఓ గుర్తింపు, హోదా లభిస్తాయి. అతనికి మన పట్ల గౌరవం, అభిమానం పెరుగుతాయి.

11. అవతలి వ్యక్తీ ముఖ్యడే అన్నట్లు ప్రవర్తించాలి:

ఇతరులతో మాట్లాడేటప్పడు నీకు ఎంతో ప్రాముఖ్యమంది అన్నట్లుగా ప్రవర్తించాలి. అతడు చెప్పేది సావధానంగా వినాలి. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాలి. దీనివల్ల అతన్ని గౌరవించినట్లవుతుంది. ఎదుటివాణ్ణి తృణీకరించకూడదు. నీకు ఏమీ తెలియదు అనకూడదు. అతని