పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందాన్నిస్తుంది. ఆ ప్రేమ లేనపుడు ఇదే కలయిక రోతనీ, కోపాన్నీ ద్వేషాన్నీ పుట్టిస్తుంది. మానభంగంలో జరిగేది యిదే.

చిన్నపిల్లల్లో లైంగిక స్పృహ వుండదు. యుక్త వయస్సు వచ్చాక సెక్సు ప్రేరణలు కలుగుతాయి. ప్రీ పురుషులు ఒకరి శరీరాలను గూర్చి ఒకరు తెలిసికో గోరుతారు. ఒకరి అభిరుచులు, అవసరాలు, భావాలు ఒకరు అర్ధం జేసికోగోరుతారు. అందరూ మనలాగే ఆలోచిస్తారా, మనలాగే అనుభూతి చెందుతారా తెలిసికొందాం అనుకొంటారు. యువతీ యువకులకు తమ శరీరాలు పెరిగే తీరూ, తమ మనసులో కలిగే లైంగిక భావాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. కొందరు యువతీ యువకులు లైంగిక ప్రయోగాలకు పూనుకొంటే ఏలా వుంటుందో చూద్దాం అనికూడ ఆలోచిస్తారు. కాని ఈలాంటి ఆలోచనలను అదుపులో వుంచుకోవాలి.

3. తొందరపాటు పనికిరాదు

జంతువుల లైంగికవ్యవస్థ పేలవమైంది. కాని నరుల లైంగిక వ్యవస్థ చాల లోతైంది. క్లిష్టమైంది, పవిత్ర మైంది కూడ. శారీరకమైన ఎదుగుదల, మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక అభివృద్ధి నిదానంగా జరుగు తాయి. ఆలాగే లైంగికమైన ఎదుగుదల కూడ నిదానంగా జరుగుతుంది. పెద్దవాళ్లకే దాని లోతుపాతులు సరిగా అర్థం కావు. ఇక యువజనానికి ఏలా అర్థమౌతాయి? కనుక యువత సెక్సును గూర్చి తొందరపడకూడదు.

కొందరు యువతీయువకులు సెక్సు సముద్రంలో అమాంతంగా దూకేయాలనుకొంటారు. దాని రుచిని వెంటనే తెలిసికోవాలని కుతూహలం జెందుతారు. ఈ తొందరపాటు పనికి రాదు. ప్రకృతిలోని వస్తువులన్నీ సహజరీతిలో, క్రమపద్ధతిలో, నిదానంగా పెరుగుతాయి. మనలోని లైంగిక శక్తులు కూడ పుష్పదళాల్లాగ నిదానంగా విచ్చుకొంటాయి. కనుక భగవంతుడూ, ప్రకృతీ నిర్ణయించిన రీతిలో మనలోని లైంగిక శక్తిని గూడ నిదానంగా పెంపు చెందనీయాలి. తొందరపడితే లైంగిక వ్వవస్థ చేకూర్చిపెట్టే సహజానందాన్ని