పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచ సాహిత్యంలో చాల భాగం ప్రేమే. అందరమూ చాలసార్లు ప్రేమ మాధుర్యాన్ని చవిజూచే వుంటాం. ప్రేమ లభించనందున కొన్నిసార్లు బాధపడి కూడ వుంటాం. ప్రేమ అమూల్య వస్తువైనా ప్రేమించడం గాని ప్రేమను పొందడం గాని ఎంతమాత్రం సులభం కాదు. దానిలో విఫలులైన వ్యక్తులను ఎందరిని చూడ్డం లేదు?

ప్రేమ అంటే యేమిటి?

మొదట ప్రేమనుగూర్చి స్పష్టమైన భావాలు వుండాలి. ఒక వ్యక్తిని ప్రేమించడమంటే అతని మేలు కోరడం. అతని అభివృద్ధిని కాంక్షించడం. మూమూలుగా మనం ఇతరుల నుండి ఏమి లాభాన్ని పొందుదామా అని చూస్తుంటాం. ఇది ప్రేమకాదు, స్వార్థం. పేము తీసికోవాలని కోరుకోదు, ఈయాలని కోరుకుంటుంది. నిజమైన ప్రేమ మాటల్లో వుండదు. మనోభావాల్లో వుండదు. చేతల్లో వుంటుంది.

ప్రేమకు కొన్ని విశిష్ట గుణాలు వున్నాయి. ప్రేమగల వ్యక్తిలో ఓర్పు, దయ వుంటాయి. అతడు అసూయ చెందడు. స్వార్థపరుడు కాడు. అమర్యాదగా ప్రవర్తించడు. ఇతరులు తన యిష్టప్రకారమే నడచు కోవాలని పట్టుబట్టడు. సులువుగా కోపపడడు. పరులు తనకు కీడు చేశారని బాధపడడు. అసలు ఇతరుల అపరాధాలను లెక్కలోకి తీసికోడు. అన్యాయాన్ని చూచి సంతోషించడు. సత్యం గెల్చినందుకు ఆనందిస్తాడు. శ్రోడి వారిపట్ల నమ్మదగినవాడుగా వంటాడు. బడాయికి పోక తగ్గివుంటాడు. నాకేమి లాభం కలుగుతుందా అని ఆలోచించక, నావల్ల ఇతరులకేమి లాభం కలుగుతుందా అని తలపోస్తాడు.

ప్రేమను ప్రదర్శించే తీరు

ప్రేమను ప్రదర్శించే విధానాలు కొన్ని వున్నాయి.

1. మొదట మనలను మనం ప్రేమించుకోవాలి. నేనంటే నాకు ఇష్టంగా వుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను నన్ను నేను నిరాకరించుకోగూడదు. నేను సర్వగుణ