పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోపానికి మనమే కారణం. నీ యనుమతి లేకుండ నిన్నెవరూ కోప పెట్టలేరు. నేను కోపపడను అని నిశ్చయించుకొన్నవాడు దేనికీ కోపపడనక్కరలేదు.

కోపం అన్ని సందర్భాల్లోను చెడ్డది కాదు. అన్యాయాన్ని ఎదరించడానికి కోపపడవలసి వస్తుంది. కొన్నిసార్లు కోపించకపోతే జరగవలసిన పనులు జరగవు. ప్రపంచంలో మంచి ఉద్యమాలు కొన్ని కోపం వల్లనే ప్రారంభమయ్యాయి. కాని ఈ సందర్భాల్లో కూడ కోపం హద్దులు దాటకూడదు. 

తరచుగా ఎదుటివాళ్ల పోకడలు మనకు నచ్చవు. వాళ్ల ప్రవర్తన మారాలని కోరుకొంటాం. మార్చాలని చూస్తాం గూడ. ఐనా వాళ్లు మారనందున మనకు కోపం వస్తుంది. కాని మనం కోరుకొన్నంత మాత్రాన్నే ఎదుటి వాళ్లు మారరు. ఆలా మారవలసిన అవసరం గూడ వాళ్లకు లేదు. కోపం తెచ్చుకోవడం మన సమస్యకాని వాళ్ల సమస్య కాదుకదా! ఎదుటివాళ్లను మార్చేశక్తీ, హక్కూ మనకు లేవు. ఇకవాళ్లు మారరు కాబట్టి మనమే మారాలి. అనగా ఎదుటివాళ్ల పోకడలకు మనం స్పందించే తీరు మార్చుకోవాలి. వాళ్లు ఈ రీతిగా ప్రవర్తించినందుకు నేను కోపపడను. ఎవరి పద్ధతి వాళ్లది అనుకోవాలి. ఆగ్రహాన్ని అణచుకోవడానికి ఇది ముఖ్యసూత్రం.

లోకం తిన్నగా గాక, వంకరటింకరగా పోతుంది. మామూలుగా మనం అన్నికార్యాలు న్యాయ యుక్తంగా, సక్రమంగా, ధర్మబద్ధంగా జరగాలని కోరు కొంటాం. ఆలా జరగనప్పడు కోపిస్తాం. కాని జనం మనం అనుకొన్నట్లుగా మెలగరు. వారిలో అనేక లోపా లుంటాయి. కనుక లోకంలో ఎప్పడూ దుర్మార్గాలు, దుష్కార్యాలు జరుగుతూనే వుంటాయి. అందుచే లోకాన్ని మార్చాలనుకొంటే కుదరదు. ఏ కొద్దిగానైనా మారేది మనమేకాని ఇతరులు కాదు. కనుక మనకు ఓర్పు అవసరం.

నేను మొనగాణ్ణి, నాకు సామర్థ్యముంది, వీళ్లందరినీ నా అదుపులో పెట్టుకొంటాను అని గర్వించకూడదు. గర్వితులకు కోపం ఎక్కువ. వినయంగా L