పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోపం వల్ల కటువుగా మాట్లాడి ఎదుటి వాళ్ల మనసు నొప్పిస్తాం. నరులు దెబ్బనైనా సహిస్తారు గాని పరుషవాక్కుని సహించరు. నోరు జారినందుకు తర్వాత పశ్చాత్తాపపడతాం. ఇవ్వాళ్ల అక్కసువల్ల ఎవరిని తిట్టామో రేపు అవసరమొచ్చి వాళ్లకాళ్లే పట్టుకోవలసి వస్తుంది.

కోపంవల్ల దుడుకు చర్యలకు పాల్పడతాం. క్రిందివాళ్ల మీదికి దూకి చేయి చేసికొంటాం. ఈ చర్య చాల అనర్ధాలకు దారి తీస్తుంది. క్రోధం వల్ల మనకు తెలియకుండానే అదుపు తప్పతాం.

తోడివారితో సఖ్యసంబంధాలు చెడతాయి. మిత్రులు బంధువులు దూరమౌతారు. కోపపడే వ్యక్తి దగ్గరికి జనం సులువుగా రారు. కస్సుబస్సుమనే వ్యక్తిని ప్రజలు విలువతో చూడరు. అతనికి ముక్కుమీదనే కోపం అని ఈసడించుకొంటారు. "కోపమువలన ఘనత కొంచమైపోవును" అన్నాడు వేమన.

6. కోపంలో చేయకూడని పనులు

కోపంలో పరుషమైన పదాలు వాడకూడదు. అనని మాట ఎవరినీ బాధించదు. అన్న మాట ఎవరికో వొకరికి బాణంలా తగులుతుంది. నేరం రుజువు గాక ముందే ఎవరినీ తొందరపడి కోపించకూడదు. కోపంగా వున్నప్పడు జాబులు వ్రాయకూడదు. అవి చదివేవాళ్లకు అసభ్యంగా వుంటాయి. అత్తమీది కోపం దుత్తమీద అన్నట్లు మన కోపాన్ని క్రిందివాళ్లమీద చూపకూడదు. 7. కోపాన్ని అణచుకొనే మార్గాలు

మన కోపస్వభావాన్ని మనం బాగా గ్రహించి వుండాలి. ఆ దుర్గుణాన్ని సవరించుకోవాలన్న కోరిక బలంగా వుండాలి. ఈ కోరిక లేందే దీన్ని వదలించు


నిజానికి ప్రక్కవాళ్లు మనకు కోపాన్ని రప్పించరు. మన చుటూ జరిగే సంఘటనలు కూడ మనకు కోపాన్ని తెచ్చిపెట్టవు. జరిగిన సంఘటనం కాక దానికి మనం ప్రభావితమయ్యే తీరు కోపాన్ని తెచ్చిపెడుతుంది. ఒకే సంఘటనం ఒకరికి కోపాన్ని కలిగించవచ్చు, మర్తిక్షకి కలిగించకపోవచ్చు. కనుక మన