పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కటువైన మాటలు వెలువడతాయి. చేతులు త్రిప్పతాం. ముఖం ఎర్రబడుతుంది. కోపం ఓ మనోభావం, ఓ స్పందన. అది మెదడులో పడుతుంది. దానివల్ల అడ్రెనిల్ అనే హార్మోను విడుదల ఔతుంది. ఇది ఉద్రేకాన్ని కలిగిస్తుంది.

2, కోపాన్ని తెచ్చిపెట్టే సందర్భాలు

కొన్ని సందర్భాలు కోపాన్ని తెచ్చిపెడతాయి. పరిసరాలు, వేడి వాతావరణం, క్రిక్కిరిసిన జనంలో వుండడం, పెద్ద శబ్దాలు, కలుషితమైన గాలి మొదలైన వన్నీ కోపాన్ని పుట్టిస్తాయి.

సామాజిక స్థితిగతులు కూడ కోపానికి కారణమవుతాయి. పేదరికంలో జీవించేవాళ్లు, మురికివాడల్లో బ్రతికేవాళ్లు, ఆర్థికమైన యిబ్బందుల్లో వున్నవాళ్లు సులువుగా సహనం కోల్పోతారు. సంపన్న కుటుంబాల్లో పుట్టినవాళూ విద్యానాగరికత ఉన్నవాళ్లు, భగవంతుడు ప్రార్ధన పాపపుణ్యాల అవగాహన వున్నవాళ్లు ప్రశాంతంగా వుంటారు. మన సమాజంలో బ్రాహ్మణులు సులువుగా కోపించరు. దళితులకు కోపం ఎక్కువ.

మన మనోధర్మాలు కూడ కోపాన్ని పుట్టిస్తాయి. సంతోషంగా వున్నప్పుడు నెమ్మదిగా వుంటాం. విచారమూ సమస్యలూ వేధిస్తున్నప్పుడు క్రోధం ఎక్కువ.

శరీర స్థితి కూడ కోపాన్ని పెంచుతుంది. అనారోగ్యం, అలసట చిరాకును పెంచుతాయి.

3. కోపంలో వివిధ దశలు

మానసిక శాస్త్రవేత్తలు దీర్ఘకాల కోపంలో నాలు దశలు గుర్తించారు. మనకు కోపం రప్పించిన వ్యక్తి లోపాలను గుర్తుకి తెచ్చుకొంటాం. అతన్ని గూర్చి చెడ్డగా భావిస్తాం. అతనిలో సద్గుణాలుకూడ వున్నా వాటిని పట్టించుకోం. అతనిమీద దురభిప్రాయం పెంచుకొంటాం.

మన విరోధికి దురుద్దేశాలు ఆపాదిస్తాం. అతనికి మనలను బాధించి ఇబ్బంది పెట్టాలనే కోరిక వుంది అనుకొంటాం. నిజానికి ఈ దురుద్దేశాలు అతనికి లేకపోవచ్చు. మనం వట్టినే భ్రమ్లలో పడిపోతాం.