పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యావన దశలో యువతీయువకుల శరీరాల్లో పెద్దమార్పులు వస్తాయి. ఈ మార్పులు మొదట మనకు భయాన్నీ ఆందోళననీ కలిగిస్తాయి. కౌన్సిలరు ఈ మార్పులను ఏలా అర్థం చేసికోవాలో తెలియజేస్తాడు.

కాలేజీ విద్యార్థులు తమ భవిష్యత్తును గూర్చీ ఉద్యోగావకాశాలను గూర్చీ తెలిసికోవాలి. కౌన్సిలరు ఈ విషయంలో గూడ మనకు సహాయం చేయగలడు.

మామూలుగా కౌన్సిలరు మనలను సానుభూతి తో అర్థంజేసికొని మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. మన పట్ల స్నేహభావంతో మెలిగి మనలను ప్రోత్సహిస్తాడు. ప్రాచీన కాలంలో మన దేశంలో గురువులు వుండేవాళ్లు. వీళ్లు శిష్యులకు అన్ని విధాల సహాయం చేసేవాళ్లు. నేటి విద్యాసంస్థల్లో పనిజేసే కౌన్సిలర్లు ఈ గురువుల్లాంటి వాళ్లే. కనుక మనం వారిని సంప్రతించి వారి సలహాలను స్వీకరించవచ్చు. అందరికీ ఇతరుల సహాయమూ సూచనలూ అవసరమే కదా! పెద్దల సూచనలు మనకు మేలేకాని చెరువు చేయవు. కనుక విద్యార్థులు కౌన్సిలరుని సలహా అడగడానికి వెనుదీయకూడదు.

8. తన కోపమె తన శత్రువు

నరుల్లో కోపం రానివాళ్లు ఎవరూ వుండరు. అందరూ కోపాన్ని ప్రదర్శిస్తూనే వుంటారు. కాని ఎప్పడు ఎవరిమీద ఎంతవరకు ఏ కారణానికి కోపించాలో తెలిసి వుండడం వివేకం. కోపం హద్దులు దాటితే జనం మెచ్చుకోరు. కోపాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్లే.

1. కోపం జనించే విధానం

మొదట మనకు ఇష్టంకాని సంఘటనం ఏదో జరుగుతుంది. ప్రక్కవాళ్లు మనకు ఏదో అన్యాయం చేశారు. వెంటనే మనలో కోపపు ఆలోచనలు జనిస్తాయి. వీళ్లు దోషులు, మోసానికి పాల్పడ్డారు అనుకొంటాం. ఈ యాలోచనలవల్ల మనలో ఉద్రేకం పడుతుంది. ఏదో నూత్నశక్తి గాలి ఊపినట్లుగా ఊపుతుంది. దానితో ఎదుటివాళ్లమీద కోపాన్ని ప్రదర్శించడానికి పూనుకొంటాం. నోటినుండి