పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలేజీల్లో విద్యార్థులకు సూచనలు ఈయడానికి కౌన్సిలర్లని నియమిస్తారు. వాళ్లు ప్రత్యేకమైన తర్ఫీదు పొందినవాళ్లు. విద్యార్థుల గొడవలను సానుభూతితో అర్ధం జేసికొని వారిని తిన్నని మార్గంలో నడిపించగలరు. కౌన్సిలరు లభించనపుడు మనకు నచ్చిన ఉపాధ్యాయుణ్ణి సలహాదారునిగా ఎన్నుకోవచ్చు. కాని అతడు మన గొడవలను సానుభూతితోను ఓపికతోను వినేవాడైయుండాలి. మనకూ అతనిపట్ల నమ్మకం వుండాలి.

విద్యార్ధులు కౌన్సిలరుతో ఏయే విషయాలు చర్చించాలి? మొదట విద్యార్థి తన్ను గూర్చిన సమాచారాన్ని కౌన్సిలరుకి తెలియజేసికోవాలి. మనం ఎవరిమో తెలియకపోతే ఇతరులు మనకు సహాయం చేయలేరు కదా! అటుపిమ్మట మన సమస్యలను అతనికి స్పష్టంగా తెలియజేయాలి. ఈ సమస్యలు నానా విధాలుగా వుండవచ్చు.

కొందరికి తల్లిదండ్రులతోనో ఇంటిలోని పెద్దవాళ్లతోనో సమస్యలు వస్తాయి. మరికొందరికి చదువు పరీక్షలు మొదలైనవాటితో సమస్యలు ఎదురౌతాయి. వేరు కొందరికి తోడి విద్యార్థులతో ఇబ్బందులు వస్తాయి. ఇంకా కొందరిని భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం మొదలైన బాధలు వేధిస్తాయి. కొందరికి లైంగిక సమస్యలు ఎదురౌతాయి. మన సమస్యలు ఏవైనా సరే కౌన్సిలరుకి తెలియజేసికొని అతని సూచనలను స్వీకరించవచ్చు.

కౌన్సిలరు మన వ్యక్తిత్వాన్నీ ప్రస్తుత సమస్యనూ పరిశీలించి మనకు సలహా యిస్తాడు. మన పొరపాట్లనూ వాటిని సవరించు కోవలసిన విధానాలనూ తెలియజేస్తాడు. తల్లిదండ్రులు కుటుంబసభ్యులతో మెలగ వలసిన తీరును చాలమంది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం వుండదు. పదిమంది ముందు నిలబడి మాట్లాడలేరు. కోపం, భయం, విచారం చెమొదలైన మనోధర్మాలు అదుపులో వుండవు. కౌన్సిలరు మనకు ధైర్యం కలిగించి మన ఆందోళనను తొలగిస్తాడు.