పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెందుతుంటారు. డబ్బు సంపాదించినట్లుగా, విజయం సాధించినట్లుగా, ప్రేయసీ ప్రియులతో విహరించినట్లుగా, సాహసకృత్యాలు చేసినట్లుగా, శత్రువులను ఓడించి నట్లుగా, హోటళ్లలో మంచి భోజనాలు ఆరగించినట్లుగా, ఇంకా ఏవేవో విలాసాల్లో మునిగి తేలినట్లుగా వెండితెరమీద చూచి, ఆ సంఘటనలు తమకే జరిగినట్లుగా ఊహించుకొని సంతోషిస్తుంటారు.

సినిమాల ప్రభావం మన ప్రజలమీద కొట్టవచ్చినట్లుగా కన్పిస్తుంది. వస్రధారణలోను, మాటల్లోను, చేతల్లోను పోకడల్లోను ప్రజలు సినీ పాత్రలను అనుకరిస్తుంటారు. విశేషంగా మధ్యతరగతి, క్రింది తరగతి ప్రజలపై సినిమా ప్రభావం మెండు. వీళ్లు సులువుగా తెరమీది పాత్రలతో తాదాత్మ్యం చెంది సంతోషిస్తారు.

సినిమాల వల్ల మన సమాజానికి చాల మేళ్ల కలిగాయి. కుటుంబసభ్యులు వీటిని చూచి కాసేపు తమ గొడవలు మరచిపోయి ఆనందం పొందుతారు. వీటిల్లో మన సంస్కృతికి చెందిన పాటలూ నృత్యాలూ చాల వస్తాయి. సుప్రసిద్ద ప్రదేశాలూ, కట్టడాలూ దర్శన మిస్తాయి. సినిమాలు జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి. మనమంతా ఏకజాతి అనే భావం కలిగిస్తాయి. మన ఇతిహాసాలూ పురాణాలూ, జానపద గాథలూ, చారిత్రక సంఘటనలూ సినిమాల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలు కూడ సినిమాల్లోకి వచ్చాయి. ఈ దృశ్యాలను చూచి జనం ఉత్తేజం పొందుతారు. హిందీ సినిమాలు ఆ భాష మాట్లాడని రాష్ట్రాల్లోని ప్రజలకు హిందీతో పరిచయం కలిగిస్తున్నాయి. ఈ విధంగా సినిమాలు మన ప్రజలకు ఎన్నో వుపకారాలు చేసిపెడుతున్నాయి.

ఐనా మన సినిమాల్లో చాల లోపాలు కూడ వున్నాయి. వీటిల్లో వాస్తవికత వుండదు. ప్రేక్షకులను ఊహాలోకంలో, సుఖమయ ప్రపంచంలో విహరించేలా చేస్తాయి. మన సినిమాలు తారలకు ఎనలేని ప్రాముఖ్యం ఇస్తాయి. తారలను బట్టే సినిమాలు విజయవంత మౌతుంటాయి. ప్రతి సినిమా తప్పకుండ రెండున్నర