పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. మనం ఇతర పనులు చేసికొనేప్పడుకూడ దీన్ని వినవచ్చు. స్నానం చేస్తూగాని, భోజనం చేస్తూకాని దీన్ని వినవచ్చు.

3. ఎక్కడికి వెళ్లినా దీన్ని వెంటతీసికొని పోవచ్చు.

4. పత్రికలను ఒకసారి ఒక్కరుమాత్రమే చదవవచ్చు. రేడియోను ఒకేసారి ఎందరైనా వినవచ్చు.

5. పత్రిక చదివేటప్పుడుకంటె దీన్ని వినేటప్పుడు ఎక్కువ ఆహ్లాదం కలుగుతుంది. దీనిలో సంగీతం, సంభాషణలు, శబ్దాలు విన్పిస్తాయి.

ఐనా రేడియోకు కొన్ని పరిమితులు కూడ వున్నాయి. దీనిలో ఒక్కోసారి ఒక్క చానల్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఒకసారి వచ్చిన ప్రోగ్రాముని మళ్లా వినడానికి వీలుండదు. రేడియోలో బొమ్మలు కన్పించవు కనుక చాలమంది దీనిపట్ల మక్కువ చూపించరు. టీవీ వచ్చాక రేడియో ఉపయోగం తగ్గిపోయింది. 

3. సినిమా

మన దేశంలో సినిమా చాల పెద్ద పరిశ్రమ. ఉక్కు బొగ్గు త్రవ్వకం వంటివిగూడ దీనికంటె చిన్న పరిశ్రమలే. ఇండియాలో ప్రతియేడు 800 సినిమాలు తీస్తున్నారు. జపాను అమెరికాలు కూడ ఈ రంగంలో మనకంటె చెనుకపడి వున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ప్రచారంలో వున్న లలిత కళలన్నిటిలోను ఇదే ముఖ్యమైంది. మన జనాభాలో రెండువంతులమంది సినిమాలు చూస్తుంటారు.

భారతీయ సినీ నిర్మాతల దృష్టిలో సినిమా ప్రజలను ఆహ్లాదపరచి విపరీతంగా డబ్బు జేసికొనే సాధనం. మన సినిమా కథల్లో గాని ఇతివృత్తాల్లోగాని వైవిధ్యం వుండదు. అన్నీ ఒకే మూసలో పోసినట్లుగా వుంటాయి. ప్రేమకథలు, పురాణకథలు, పోరాటాలు, సాహసయాత్రలు మొదలైనవి అన్ని సినిమాల్లోను ఒకే విధంగా వుండి విసుగు పుట్టిస్తాయి.

ఐనా మన జనంలో లక్షలాదిమందికి సినిమా మత్తుమందు. వీళ్లు నిజజీవితంలో పొందలేని సుఖసంతోషాలను తెరమీది బొమ్మల్లో చూచి సంతృప్తి