పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కష్టపెడతాం. ఈ పొరపాట్లకు చింతించాలి. వాటిని మళ్లా చేయగూడదని నిశ్చయించుకోవాలి. దీనివల్ల మనసు నిర్మలమూతుంది.

11. అపరాధాలను క్షమించాలి

అనుకోకుండానే ఇతరులు మనకు అపరాధం చేస్తారు. ఐనా విరోధిని క్షమించాలి. పగతీర్చుకోవాలని కోరుకోకూడదు. అపరాధాన్ని విస్మరించి విరోధితో స్నేహంగా మెలగాలి. దీనికి పెద్ద మనసు కావాలి.

12. దేశభక్తి మాతృ

భూమిపట్ల ప్రేమ వుండాలి. జన్మభూమి కొరకు పెద్ద త్యాగాలు చేయడానికి కూడ సిద్ధంగా వుండాలి. భారతీయులమైనందుకు గర్వించాలి. మనదేశాన్ని గూర్చి మనకు బాగా తెలిసివుండాలి.


13. సమాజం పట్ల ప్రేమ

మనమందరం ఒకదేశపౌరులం. కనుక తోడివారితో కలవాలి. మన సమాజంపట్ల మనకు ప్రేమ గౌరవం వుండాలి. సమాజాభివృద్ధికి తోడ్పడాలి. సమాజసేవలో పాల్గొనాలి.

14. శాంతి, అహింస

శాంతిని చెరచకూడదు. తగాదాలకు దూరంగా వుండాలి. అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకోవాలి. మాటలచేత, చేతలచేత ఇతరులను బాధించ కూడదు. జంతువుల పట్లగూడ కరుణ చూపాలి.

2. వ్యక్తిగతమైన విలువలు

మామూలుగా మనం సామాజిక విలువలకంటె వ్యక్తిగతమైన విలువలనే ఎక్కువగా పాటిస్తాం. ఈ వర్గంలో ముఖ్యమైనవాటిని కొన్నిటిని పరిశీలిద్దాం. 1. నిరాడంబరంగా మెలగడం నేటియుగం చాల క్లిష్టమైంది. అందరూ తామున్నదానికంటె గొప్పగా కన్పించాలని తాపత్రయ పడుతుంటారు. అంతట డాబుసరి కొట్టవచ్చినట్లుగా