పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
5. మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి

అందరికీ సమాజంపట్ల కొన్ని బాధ్యతలూ విధులూ వుంటాయి. వాటిని సక్రమంగా నిర్వహించాలి. సమాజం నుండి మనకు చాల లాభాలు కలుగుతాయి. కనుక మనం కూడ సమాజానికి కొన్ని సేవలు చేసిపెట్టాలి.

6. సహనం, ఓర్పు

కొన్నిసార్లు తెలిసో తెలియకో ఇతరులు మనకు కీడు చేయవచ్చు. ఆలాగే మన చుటూ జరిగే సంఘటనలు కూడ మనలను ఇబ్బంది పెట్టవచ్చు. ఈ పరిస్తితుల్లో సహనం ఓర్పు చూపవలసి వుంటుంది. సులువుగా కోపతాపాలకు గురికాకూడదు.

7. సేవాభావం

ఇతరుల అక్కరలు కూడ మన అక్కరల్లాంటివే. చాల పర్యాయాలు ఇతరులకు సహాయం చేయగలిగి కూడ చేయం. విశేషంగా పేదలకూ, దీనులకూ సేవ చేయడానికి సిద్ధంగా వుండాలి. సేవచేయడం నీచంగాదు, గౌరవప్రదం.

8. బృందభావన

కొంతమంది స్వయంగా ఎంత శ్రమైనా చేస్తారు. కాని ఇతరులతో కలసి పనిచేయడానికి వొప్పకోరు. పేరంతా తమకే దక్కాలని కోరుకొంటారు. ఇది పొరపాటు. తోడివారితో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా వుండాలి. ఇతరులు విజయం సాధించినపుడు సంతోషించాలి.

9. సానుభూతి చూపడం

ఇతరుల ఇబ్బందినీ, బాధనూ దయతో అర్థం జేసికోవాలి. వారిలోనికి ప్రవేశించి వారి బాధను మనం కూడ కొంతవరకు అనుభవించాలి. కరుణతో బాధితులకు సహాయం చేయాలి. ప్రక్కవాడి గోడు నా గోడు అనుకోవాలి.

10. పశ్చాత్తాప భావం

ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం. చేయగూడని పనిచేసి ఇతరులను