పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3. తోడివారితో సఖ్యసంబంధాలు

నరులు సంఘజీవులు. ఒంటరిగా వుండిపోతే ఏ నరుడూ వృద్ధిలోకి రాడు. మన అభివృద్ధి చాలావరకు ఇతరుల మీద ఆధారపడి వుంటుంది. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు మొదలైన నానా వర్గాలవాళ్ల వల్లనే మనం వృద్ధిచెంది విజయాలు సాధిస్తున్నాం. కనుక ఎప్పడూ తోడిజనంతో సఖ్యసంబంధాలు పెంపొందించుకొంటుండాలి. నాకు నేను చాలుదును అన్నట్లుగా వుండిపోతే చెడిపోతాం.

1. ఇంటిలో సఖ్యసంబంధాలు

సఖ్యసంబంధాలు మొదట ఇంటిపట్టుననే ప్రారంభమౌతాయి. ఇంటిలో తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్మలు మొదలైన వాళ్లంతా మన వ్యక్తిత్వాన్ని పెంచుతారు. కుటుంబం సక్రమంగా వుంటే సమాజం, జాతి అభివృద్ధిలోకి వస్తాయి. నేడు సమాజంలోని చాల రుగ్మతలకు కారణం కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడమే. కుటుంబం ప్రేమతో, పరస్పర సహకారంతో నిండివుంటే నరులు మంచి పౌరులుగా తయారౌతారు. కనుక మొదట కుటుంబ సభ్యుల్లో మంచి సఖ్యత నెలకొనాలి.

2. స్నేహితులతో సఖ్యసంబంధాలు

స్నేహితులు మనలను ప్రేమతో అంగీకరిస్తారు, ధైర్యం చెప్తారు. ప్రోత్సహిస్తారు. మన పొరపాట్లను సవరిస్తారు. చాల విషయాలను స్నేహితుల నుంచే తెలిసికొంటాం. మిత్రులు లేని జీవితం ఎడారి లాంటిది. జీవితంలో కొన్ని పర్యాయాలు బంధువుల కంటే స్నేహితులే ఎక్కువగా ఉపయోగపడతారు. కనుక ఎప్పడూ మిత్రులను ప్రోగుచేసికొని వారితో సఖ్యసంబంధాలు పెంపొందించుకొంటూండాలి. మన సంపదల్లో గొప్ప సంపద మిత్ర సంపద.

3. పాటించవలసిన నియమాలు కుటుంబసభ్యులతో గాని, స్నేహితులతో గాని సఖ్యతను పెంచుకోవాలంటే ○