పుట:NagaraSarwaswam.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87

యువతి బాలవలె కాక సిగ్గును పెడగానెట్టి భర్తతోడి పొందునకు పరిచిత అయివుంటుంది. అందుచే ఆమెను భర్త, శయ్యపై శయనించి వున్నపుడే ఆలింగన చుంబినాదులనే లాలించి రతిక్రీడకు వున్ముఖురాలుగ చేసికొనడం తగివుంటుంది.

ఇక ప్రౌఢావస్థలో అడుగుపెట్టిన వనితయందు లజ్జకాదు కాని, అట్టిదైన లక్షణం కనబడుతుంది. ఆమె భర్తశయనించిన శయ్యపై స్వేచ్చగా వచ్చి కూర్చుంటుంది. కాని అతనిలో ఆమెను కలియవలెనన్న లక్షణం కనబడినంతనే 'ఎల్లప్పుడు ఇదేపనియా?' లజ్జా మధురంగా తిరస్కరించి వెళ్లిపోయే లక్షణం ఏర్పడుతుంది. అప్పుడు పురుషుడు ఆమెలేచివున్న ఆస్థితియందే ఆలింగన చుంబనాదులనే ఆమెను అంకెకు తెచ్చుకొనాలి.

ఏపరిస్థితియందును పురుషుడు భార్యయందు రతికి తగినఆవేశము యేర్పడుటకు ముందు రతికి ఉపక్రమించకూడదు. బాగా చలిగా వున్నప్పుడుమాత్రమే ఎండవలన సుఖం. ఆచలి లేనపుడు ఎండవలన సుఖ మేర్పడదు సరికదా దుఃఖము కలుగుతుంది. అట్లే మనస్సులో తగినంత కోరిక ఉన్నపుడే రతివలన సుఖము. ఆకోరిక లేనపుడు రతివలన సుఖముండదు. బాధకలుగుతుంది. ప్రియురాలి మనస్సులో రతియందు కోరికలేనపుడు ప్రియుడు రతికి ఉపక్రమిస్తే ఆమెకు సుఖముండదు. ఆమె బాధపడుతుంది. అట్లు బాధపడుతూవున్న వనితతోడి సాంగత్యమైనందున ఈ పురుషునకు తగినంత సుఖముండదు. అందుచే భార్యలో కోరికలేనపుడు పురుషుడు ఆలింగనాదులచే మొదట ఆమెలో బాగా కోరికను ప్రేరేపించి పిమ్మటనే రతికి ఉపక్రమించాలి.

మిక్కుటమైన కోరిక మనస్సులో కలిగినపుడు స్త్రీలు అంతవరకు ప్రదర్శించిన లజ్జను పరిత్యజిస్తారు. దీర్ఘంగా నిట్టూరుస్తారు. వారి ముఖంమీద చిరుచెమట పొటమరిస్తుంది. వారు యేదో అనిర్వచనీయమైన వికారభావాన్ని పొందినట్లు కానవస్తారు. అప్పు