పుట:NagaraSarwaswam.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86


ఆనందమే కలుగుతుంది. దీనివలన పురుషుని బలము తరుగదు. పైగా పెరుగుతుంది.

యువతి లేక ప్రౌఢ అయి ఉన్నభార్య హేమంత-శిశిరముల యందు (మార్గశిర పుష్యమాసములు-మాఘ ఫాల్గున మాసములు) భర్తను మిక్కిలి సుఖం కలిగిస్తుంది. ఏమంటే యువతీ శరీరము ప్రౌఢ యొక్క దేహము మిక్కిలి పరిపుష్టంగా ఉంటుంది. ఆకాలముకూడ విపరీతమైన మంచుకు, చలికి నెలవై దేహపుష్టికల భార్యాసాంగత్యము మిక్కిలి సుఖాన్ని అందిస్తుంది. కాని యువతీ సాంగత్యము వలన పురుషుని బలం తగ్గుతుందని, ప్రౌఢాసాంగత్యము భర్తకు వార్దక్యాన్ని (ముసలితనము) దగ్గరచేస్తుందని శాస్త్రకారుల అభిప్రాయము. భార్యకు వయస్సు గడుస్తూవుంటే భర్తకుకూడ వయస్సు గడవడం, ఆవిధంగా వార్ధక్యానికి సన్నిహితుడు కావడం సత్యదూరం కాదు.

ఇక యేబదియేండ్లు దాటినవనిత స్వయంగానే మన్మధవ్యాపారానికి అంతఉత్సాహము కలిగివుండదు. ఆమెతోబాటు సమానంగా పండుతూ వచ్చిన ఆమెభర్తయందు కూడ భార్యను కలియవలెనన్న కోరిక సన్నగిలుతుంది. అట్టిదంపతులు ఎడనెడ శారీరకంగా కలుస్తూ వున్నా, వారు తాము యౌవనంలో అనుభవించిన సుఖానందముల సంస్మరణ తోడనే ఎక్కువగా ఆనందించేవారై, ఆయా విషయాలు త్రవ్వి చెప్పుకొంటూ ఒకనిండైన శరీరసాంగత్య రహితమైన సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది.

బాల అయి ఉన్నభార్యను ఆమె కూర్చుండివున్న సమయమునందే భర్త యేవో మాటలుచెప్పి, లేదా అల్పములైన ఆలింగన చుంబనాదులచే రతికి ఉన్ముఖురాలుగా చేసుకోవాలి. యేమంటే ఆ వయస్సులో ఆమెకు లజ్జ ఎక్కువగా వుంటుంది. స్వయంగా వచ్చి భర్త శయనించిన శయ్యపైశయనింపదు. అందుచే ఆమెను కూర్చుండి ఉన్నపుడే లాలించి అనుకూలంగా చేసికొనడం తగివుంటుంది.