పుట:NagaraSarwaswam.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ఉచ్చరతియందు స్త్రీయొక్క యోనికంటె పురుషాంగము పెద్దదై వున్నందున యోనియందలి దురద తొలగుటలో కొంత సుఖము ఏర్పడి వున్నప్పటికి స్త్రీ కొంత భాదనుకూడ అనుభవించేదై వుంటుంది. పురుషునకు కూడ సమరతివలె యీ వుచ్చరతి చాలినంత తృప్తిని కలిగించదు. అందుచే యీ వుచ్చరతి సమరతి తరువాత పేర్కొనదగినదై వుంటుంది.

ఇక నీచరతియందు పురుషాంగముయొక్క ప్రమాణము మిక్కిలి తక్కువై వుండుటచే స్త్రీయొక్క యోనియందు తగినవిధంగా ఘట్టనం ఏర్పడే అవకాశమేలేదు. అందుచే అచ్చట పురుషుడు ఎంతశ్రమించినా స్త్రీయొక్క యోనియందలి దురద తీరదు. ఆమె తృప్తిచెందుటకు అవకాశము వుండదు.

అత్యుచ్చరతియందు స్త్రీకి కేవలము బాధమిగులుతుంది. అతినీచరతియందు ఆమెకు తృప్తికలిగే అవకాశము అసలేలేదు.

అందుచే సమరతి ఉత్తమమైనదని, వుచ్చరతి ద్వితీయ పక్షమని మిగిలిన రతులు వుభయ సుఖకరములు కావని గుర్తించాలి. పురుషుడు కామశాస్త్రములు చదివినవాడై తానేజాతికి చెందినవాడో గుర్తించి, తనకు తగిన జాతిస్త్రీని పరిణయమాడినపుడు మాత్రమే నిజమైన దాంపత్య సుఖము అనుభవింప గలుగుతాడు.

రతియందు తనకు తృప్తికలిగించే పురుషునియందు స్త్రీ మిక్కిలి మక్కువకలదై వుంటుంది; నగలు, సొమ్ములు మొదలగునవి ఎన్ని ఇచ్చినప్పటికి రతియందు తనను తృప్తి పరుపజాలని భర్తయందు స్త్రీలకు అనురాగం వుండదు. ఎవని సాంగత్యములో స్త్రీ పరవశయై రజస్సును స్రవిస్తుందో ఆ పురుషునియం దామె యొక్క ప్రేమ అనంతమై వుంటుంది. అట్టివాడైన భర్తయొక్క వియోగాన్ని క్షణకాలముకూడ సహించలేదు. ఒకవేళ విధివశమున వారికి