పుట:NagaraSarwaswam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

73

ఈ విభాగానికి ప్రధానలక్షణాలు పురుషాంగము, స్త్రీయొక్క యోని అయిఉన్నాయి. పురుషులందరియొక్క పురుషాంగములు సమానమైన పరిమాణం (పొడవు) కలిగిఉండవు. అట్లే స్త్రీలయొక్క యోనులుకూడా అన్నీ ఒకేవిధంగా ఉండవు. వానియొక్క లోతులలో తేడాలు ఉంటాయి. కొందరు పురుషులకు పురుషాంగము ఆరుఅంగులముల పొడవుకలదిగావుంటే కొందరి పురుషాంగము తొమ్మిదిఅంగులముల పొడవు కలిగివుంటుంది. కొందరి పురుషాంగము సుధీర్ఘమై పండ్రెండు అంగుళముల పొడవు కలిగివుంటుంది. ఇందు ఆరుఅంగుళముల పొడవుగల పురుషాంగముకలవారు శశజాతి పురుషులు అనబడతారు. తొమ్మిది అంగుళముల పురుషాంగముకలవారు వృషభజాతి వారనబడతారు. పండ్రెండు అంగుళముల పురుషాంగముకలవారు అశ్వజాతి పురుషులుగా పేర్కొనబడతారు.

ఇట్లే ఆరుఅంగుళములు మాత్రమే లోతైన యోనికల స్త్రీలు హరిణీ జాతివారనియు, తొమ్మిది అంగుళముల లోతైన యోనికల స్త్రీలు బడబాజాతి స్త్రీలనియు, మిక్కిలి యెక్కువగా 12 అంగుళముల వరకు లోతైన యోనికలస్త్రీలు హస్తినీజాతి స్త్రీలనియు చెప్పబడతారు.

అయితే యీలక్షణాలు ఆ స్త్రీ పురుషులను చూచీచూడగానే తెలియబడేవి కావుకదా ! అందుచే ఆయా జాతులయొక్క ప్రధాన లక్షణాలు గుహ్యవయవ పరిమాణములే అయిఉన్నప్పటికి కొన్ని బాహ్య లక్షణాలుకూడా చెప్పబడుతున్నాయి.

శశజాతిపురుషులు:- ఈజాతిపురుషుల శరీరం కాంతిమంతమై ఉంటుంది. వీరుఎల్లప్పుడు సంతోషంగావుండే స్వభావంకలవారై చిరునవ్వు నవ్వుతూవుంటారు. వీరి పలువరుస చక్కగా ఎగుడు దిగుడులులేక సమంగా ఉంటుంది. మధురంగా మాటాడడం వీరిసొత్తు. వీరి ముఖం గుండ్రంగావుంటుంది. చేతివ్రేళ్ళు చాచినప్పుడు ఆవ్రేళ్లసందులు కనబడక మాంసలములై వుంటాయి. పలుచని పాదాలు,