పుట:NagaraSarwaswam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

తొమ్మిది నెలలు గడచాయి. ఒక మంచి ముహూర్తాన పెద్దభార్య కళావతీదేవికి మగబిడ్డ జన్మించాడు. ఈవార్త నగరం అంతట ప్రాకింది. అంతా ఉత్సాహంగా ఉన్నారు. అంతలో రెండవ భార్య ఇందుమతీదేవికికూడ మగబిడ్డ కలిగినాడన్నవార్త, దానికి వెంటనే మూడవభార్య రత్నావతీదేవికి, నాల్గవభార్య మాలాదేవికికూడ మగబిడ్డలే జన్మించారన్న శుభవర్తమానం నగరంలో వ్యాపించింది. దానితో ఆరాజుయొక్క రాజధాని నరగమంతా ఉత్సాహంతో నిండిపోయింది.

మహారాజు రిపుంజయుని హృదయం ఒక్కసారిగా జన్మించిన కుమారులను చూడడంతో పున్నమిచంద్రుని జూచిన సముద్రంలా పొంగింది. ఆయన యెన్నో వేడుకలు ఉత్సవాలు జరిపించాడు. దానధర్మాలు ఆచరించాడు.

ఆ రాజకుమారులు కూడ తల్లిదండ్రులవలెనే అందంగా ఉన్నారు. వారి మొగములేకాదు, చేతులు, కన్నులు, పాదాలుకూడ అరవిడిచిన ఎఱ్రతామరవలె ఉన్నాయి.

రిపుంజయుడు వారికి జాతకర్మ చేయించి పెద్దవానికి అజయుడని రెండవవానికి విజయుడని మూడవవానికి సూర్యుడని నాల్గవవానికి చంద్రుడని పేరులు పెట్టాడు.

ఆ బాలకులు తల్లుల ఒడులలోనో, తండ్రి గుండెమీదనో ఉండేవారేకాని ఊయలలో ఉండడం అన్నదిలేదు. వారిని తల్లిదండ్రులు అంత ముద్దుగా చూస్తూ ఉండేవారు. క్రమంగా ఆ బాలురు పెరిగి అంతఃపురం అంతా ప్రాకడానికి ఆరంభించారు. వారు అంతఃపురం యొక్క నడవలో నాలుగువైపులకు ప్రాకివెళ్ళి వెనుదిరిగి చూచినపుడు ఒక్కసారిగా నాలుగుచంద్రబింబాలు ఎదురెదురుగా ఉదయించినట్లు ఉండేది.

రిపుంజయుడు తనకుమారులకు ఐదేండ్లు వచ్చినంతనే చదువుచెప్పుటకై తగిన ఉపాధ్యాయులను నియమించాడు. ఆరాకుమారులు