పుట:NagaraSarwaswam.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56


ఋష్యశృంగుడు వారివంక చూచి మరీ ఆశ్చర్యానికిలోనై ఇలా అన్నాడు.

"ఋషికుమారులారా! మీ ముధము మీద తేజస్సుకే ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు మీ గుండెలమీద బంతుల వంటివి ఏవో కనబడుతున్నాయి. అవేమిటి? అన్నాడు.

వేశ్యలు ఆయనయొక్క యిలాంటి ప్రశ్నలకు ఏవో సమాధానాలు చెపుతూ క్రమంగా ఆయనను అంగదేశానికి తీసికొని వచ్చారు. ఋష్యశృంగునిరాకతో అంగదేశంలో వర్షాలుకురిశాయి. కరవు తొలగింది. ఆ ఋష్యశృంగుడే దశరథునకు సంతానం కలుగకపోతే 'పుత్రకామేష్టి' చేయించాడు. ఆ యాగఫలముగానే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఈకథ రామాయణంలో విపులంగావుంది,

లోకంలో ఋష్యశృంగునివంటి ప్రకృతులుచాలా అరుదు. సాధారణముగా బాల్య యౌవ్వనాల సంధియందే శృంగార భావం జాగృతం అవుతుంది.

కొందరి యందీభావము చాల తక్కువగా యుంటుంది. కొందరి యందిది ఎక్కువగాను, మరికొందరియందు చాల అధికంగాను ఉంటుంది.

అసలా యీశృంగార భావము యేయే అంతరువులలో జన్మిస్తుంది? అన్న విషయాన్ని అలంకారికులు అలంకార శాస్త్రాలలోని రసచర్చలో విపులంగా వివరించారు. ఆ వివరణ అంతా చెప్పడానికి ఇది స్థానంకాదు. అయినా అల్పంగానైనా వివరించకపోతే దాని రూపం తెలియడం కష్టంగనుక కొంత వివరిస్తున్నాము.

"సహజంగా స్త్రీని అనుభవించవలెనన్న కోరిక పురుషుని మనస్సులోను, పురుషుని పొందు బడయాలన్న కోరిక స్త్రీ మనస్సులోను ఉంటుంది. అయితే ఆకోరిక బాగా నివురుగప్పిన నిప్పులా వుంటుంది. కోరికయొక్క అట్టి స్థితినే 'రతి' అన్నారు.