పుట:NagaraSarwaswam.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55


వచ్చినా ఆయనకు స్త్రీ అంటే ఏమిటోకూడ తెలియదు. ఆయనను అంగదేశానికి తేవడం ఎలా? ఎవరీ పనికి పూనుకొంటారు. రావయ్యా ! అని ఆహ్వానించిన మాత్రంలో వస్తాడోరాడో, అన్న శంకకూడ కలిగింది.

అంగదేశంలోని వేశ్యలు మిక్కిలి రూపవంతులు. తమ సౌందర్యంతో ఎట్టివానినైనా సరే పాదదాసుడుగా చేసికొనగలమన్న గర్వంకలవారు. వారు మేమా ఋష్యశృంగుని ఈదేశానికి తీసుకురాగలమ"న్నారు.

ఆ వేశ్యలలో పడుచుదనంలోఉన్న నెరజాణలైన అందగత్తెలు కొందరు విభాండకుని ఆశ్రమానికి చేరుకొన్నారు. వారు వచ్చిన సమయానికి విభాండకుడు ఆశ్రమంలోలేడు. ఋష్యశృంగు డొక్కడే ఉన్నాడు. ఆశ్రమానికి వచ్చిన యీ వేశ్యలనుజూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన వారినిచూచి-"ఎవరో ఋషి కుమారులు, మిక్కిలి తపంచేసి ఎంతో తేజం సంపాదించుకొన్నారు. నేనూ తపస్సు చేస్తున్నాను కాని ఇంతతేజం నాకు కలుగలేదే!" అనుకొంటూ ఇలా ప్రశ్నించాడు.

ఓ ముని కుమారులారా! మీ రెవరు? మీరు చేసే తపోవిధానం యేమిటి? మీ జుట్టు అంతపొడవుగా సుందరముగా ఉన్నదేమిటి? మీ ముఖంమీద యీ వింత తేజస్సు యెలా యేర్పడ్డది? అని ప్రశ్నించాడు.

ఆ వేశ్యలు ఋష్యశృంగునియొక్క ఈ ప్రశ్నలువిని ఆశ్చర్య పోయారు. అయినా వారంతా నెరజాణలు. "మేము చేసే తపస్సును గూర్చి వివరిస్తాం రమ్మంటూ వారు ఆయనను సమీపములోవున్న నదికి తీసికొనివెళ్లేరు. అక్కడ నదిలో ఋష్యశృంగునితో వారున్ను స్నానంచేసేరు.

ఆ వేశ్యలు ధరించిన వస్త్రాలు మిక్కిలి పల్చనివి. ఆ పల్చని వస్త్రాలు నీటిలో తడిసి వారి శరీరానికి అంటుకొనిపోయాయి. అప్పుడు