పుట:NagaraSarwaswam.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శృంగార చేష్టలు

ఏ సంకేతాలైనా యువతీ యువకుల మానసంలో శృంగారభావం ఉద్భంధమైనపుడు (మేలుకొన్నపుడు) చేయబడితేనే చరితార్ధం అవుతుంది. వట్టికట్టెల ప్రోవుదగ్గర కూర్చుండి చలికాగడం అన్నది సాధ్యంకాదు. ఆ కట్టెలయందు అగ్ని జ్వలిస్తూండాలి. అప్పుడే ఎవరైనా తమ శీతబాధను తొలగించుకొనగలుగుతారు. అలాగే కామినీకాముకుల మానసంలో శృంగారభావం జ్వలిస్తూ ఉన్నప్పుడే సంకేతము మొదలైన వ్యవహారలన్నిటికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా యౌవ్వనం వచ్చేసరికి అందరియందు యీ శృంగారభావం మేల్కొనడానికి తగినస్థితి కలదై యుంటుంది. కాని లోకంలో వయస్సువచ్చినా శృంగారభావంయొక్క స్పర్శ అయినా ఎఱుగని మనస్సుకలవారుకూడ ఉంటారు. రామాయణంలోని ఋష్యశృంగుడు అట్టివాడు.

ఒకప్పుడు అంగదేశములో కరవువచ్చింది. వానలులేవు. జనం అన్నంలేక అల్లాడిపోతున్నారు. వానలు కురిసి కరవు తొలగాలీఅంటే ఎవరైనా మంచి శీలంకల మహర్షి యీ దేశంలో అడుగుపెట్టాలి. అప్పుడు మాత్రమే యీ కరవు తొలగే అవకాశం ఉన్నదన్నారు పండితులు. అయితే అట్టి మహర్షి యెవరన్న ప్రశ్న బయలుదేరింది. చివరకు విభాండకుడనే ఋషికి కుమారుడైన ఋష్యశృంగుడట్టివాడని తేలింది. ఆ ఋష్య శృంగుడు విభాండకుని కట్టడిలో తన తపమేమో తన జపమేమో తప్ప ఇతరచింతలేకుండ జీవిస్తున్నాడు. యౌవ్వనం