పుట:NagaraSarwaswam.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50


పరచి వానిని చక్కగా మడవడం అవసరం. ఈ తాంబూల నిర్మాణానికికూడ లవంగము తోడ్పడుతుంది.

ఈ చతురస్ర తాంబూలము—'నీవూ నేనూ కలియడానికి ఇది యెంతమాత్రమూ తగిన సమయంకాదు'–అనడానికి సంకేతమైఉన్నది. కామినీకాముకులు ఒకరినొకరు కలియడానికి తగిన సమయంకాదని సూచించడానికై యీ తాంబూలాన్ని వుపయోగిస్తారు.

యీ చతురస్ర తాంబూలమే—వక్కలు లేకుండ పంపబడితే-"నాకు నీయందు ప్రేమలేదు"—అనడానికి సంకేతమై ఉంటుంది. అట్టి తాంబూలము తనయొద్దకు వచ్చినపుడు-దానిని పంపినవారు తన్ను ప్రేమించడం లేదని గుర్తించాలి.

పై చతురస్రతాంబూలమే ఏలకులు ఎక్కువగావేసి పంపితే-'నాకు నీయందు ప్రేమ ఉన్నది, కాని మన కలయికకు ఇది తగిన సమయంకాదు'—అన్న విషయానికి సంకేతమై ఉన్నది.

విజ్ఞులైన నాగరజనం ఈ తాంబూలసంకేతలద్వారా పరస్పరం భావాలను అవగాహన చేసికొంటూ ఆనందించేవారై యుంటారు. తాంబూల సంకేతాలలో ఈఐదు మాత్రమే ప్రధానమైనవైవున్నా, ఇంకాకొన్ని అవాంతర భేదాలుకూడ వీనిలో వున్నాయి.

తమలపాకులను రెంటిని తెచ్చి వానిని ఒకదాని వీపు (అడుగు భాగము) వేరొకదాని వీపుకు తగులునట్లు (ఎడమొగము పెడమొగముగా) తలక్రిందుచేసి వానిని చుట్టగాచుట్టి, ఆ చుట్ట ఊడిపోవకుండుటకో అన్నట్లు దానిపై సన్నని నల్లదారము మెలిపెట్టి పంపినచో అది-వియోగ సూచనకు సంకేతమైయున్నది.

అట్లుకాక 'తమలపాకులను ఒకదాని ముఖము (పై భాగము) వేరొకదాని ముఖముతో అంటి యుండునటులు పరచి ఎర్రదారముతో చుట్టిపంపుట'—సంయోగమునకు సంకేతమై యున్నది.

తమలపాకులను మధ్యకు చీల్చి వానిని చుట్టి, సన్నని నల్లదారముతో ముడివేసి పంపుట'—నీకును నాకును ఇక సంబంధములేదు,