పుట:NagaraSarwaswam.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48


కన్య ఉన్నది. ఈ మేనల్లునకు ఆమెనిచ్చి వివాహంచేస్తే బాగానే ఉంటుంది. ఆ యువతికూడ యీ మేనత్తకొడుకుమీద ప్రేమలేకపోలేదు. కాని ఏవో కారణాలవల్ల ఆ వ్యవహారం పొసగిరావడంలేదు. ఈపరిస్థితులలో ఇంటికివచ్చినబావ భోజనంచేసినంతనే ఆనెరజాణఅయిన మరదలు కౌశలం వుట్టిపడే తాంబూలాన్ని నిర్మించి అతనికి అందించింది. అనగా ఓ బావా! పెద్దలు కట్నాలకనియో, కాన్కలకనియో ఏవో అభ్యంతరాలు చెపుతున్నారు. కాని యీ అభ్యంతరాల నన్నింటిని దాటి నా మనస్సు నీయందు లగ్నమైయున్నది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను'-అని చెప్పినట్లే కౌశల తాంబూలంయొక్క ఉపయోగానికి ఇది ఉదాహరణముగా చెప్పబడ్డది. ఇట్టివే అయిన భిన్నభిన్నపరిస్థితులలో ఈకౌశలతాంబూలాన్ని సాంకేతికముగా నాగరకులు వాడుతూంటారు.

అంకుశము:—వెనుక భాషా సంకేతములయందు వివరించిన అంకుశముయొక్క ఆకృతివంటి ఆకృతి ఏర్పడునట్లు నిర్మించి తాంబూలము 'అంకుశము' అనబడుతుంది. 'ప్రియాహ్వానానికి' సంకేతముగా నాగరజనం దీనిని వినియోగిస్తారు.

ఇట్టి తాంబూలము పంపబడినపుడు ఆ తాంబూలమును పంపినవారు-తమ్ము సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారని గ్రహించాలి.

కందర్పము:—తమలపాకులకు సున్నము రాసి, యీనెలుతీసి, వక్కలు మొదలగువానిని వానియందుంచి, మూడుకోణములు వచ్చునట్లు చుట్టినచో ఆ తాంబూలము కందర్పము అనబడుతుంది ఈకోణములు వచ్చుటకు తమలపాకుల చివళ్లు మిక్కిలి సాయపడతాయి.

'నేను మన్మథునిచే పీడింపబడుతున్నాను' అనడానికి యీ తాంబూలము సంకేతమై యున్నది.

చిరకాలానికి దూరదేశంనుండి వచ్చిన భర్త భోజనంచేసి తన తల్లిదండ్రులతో మాటాడుతూ కూర్చున్నాడు. రాత్రి చాలగడచింది, అయినా ఆ కబుర్లకు అంతు కనబడడంలేదు. ఇక్కడ తాను (భార్య)