పుట:NagaraSarwaswam.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47


దానినిగ్రహించిన తమ నెచ్చెలియొక్క కూటమిలో మిక్కిలి ఆనందించేవారు అవుతారు.

పతి భోజనంచేసి ఎవరితోడనో మాటాడుతూ కూర్చున్నాడు. భార్య అతనికి తాంబూలం పంపింది. ఆతాంబూల నిర్మాణం విచిత్రంగా వుంది. భావస్ఫోరకంగా వున్నది. అది ఏదో ఒక సంకేతార్థాన్ని సూచిస్తూన్నట్లు వున్నది. అప్పుడు ఆ సంకేతార్ధం తెలిసికొన్న పతికి, దానిని పంపిన భార్యకు వింత ఆనందం కలగడానికి సావకాశంలేదా! అందుకే నాగరజనం తాంబూల నిర్మాణములో నైపుణ్యము కలవారై తమ మనోభావాలను వానిద్వారా వ్యక్తంచేసి ఆనందించేవారై యుంటారు.

తమలపాకులకు సున్నమురాసి వక్కలు మొదలగునవి వానియందుంచి చుట్టగా చుట్టుటలోని వైవిద్యాన్ని అనుసరించి యీతాంబూల సంకేతాలు ఏర్పడ్డాయి.

ఇలా విభిన్నములైన తాంబూల నిర్మాణములు 1 కౌశలము 2 అంకుశము 3 కందర్పము 4 పర్యంకము 5 చతురస్రము అని ప్రధానంగా ఐదురకాలుగా ఉన్నాయి. ఈ ఐదింటిని ఐదు రకాలైన భావాలకు సంకేతంగా నాగరజనం వుపయోగిస్తూంటారు.

కౌశలము:- మిక్కిలి నేర్పుగా చుట్టబడిన తాంబూలమునకు 'కౌశలము' అనిపేరు. యీ నేర్పు తమలపాకుల యీనెలు తీయుటయందు, వానికి సున్నము రాయుటయందు వానియందు వక్కలు మొ॥వి సమముగా (ఆకారమునకు రుచికికూడ) వుంచుటయందు అవి యేమాత్రము నలుగకుండ చుట్టచుట్టుటయందు నాగరులు వ్యక్తంచేస్తారు.

ఇట్టి కౌశల తాంబూలము—"నాకు నీ యందు ప్రేమయెక్కువ" అనడానికి సంకేతంగా వుపయోగింపబడుతుంది.

ఒక నాగర యువకుడు తన మేనమామ యింటికివెళ్లేడు. ఆతడు అవివాహితుడు. ఆ మేనమామవద్ద వివాహము కాదగిన సుందరియైన