పుట:NagaraSarwaswam.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45

తనమనోభావాన్ని వ్యక్తంచేయడం జరుగుతుంది. కొన్నిచోట్ల కామినీ కాముకులు యీవస్త్రాలను ఒకరియొద్దకొకరు పంపడంకూడజరుగుతుంది.

తన యింటికి వచ్చిన ప్రియునకు నిగూఢంగా నేను మదనునిచే మిక్కిలి వేధింపబడుతున్నాను. అతడు నా మనస్సును చాలారకాలుగా గాయపరచాడు. ఇకనేను తాళలేను-అని సూచించడానికి చిల్లులు పడిన (చిరుగులు కాదు) వస్త్రము సంకేతముగా చెప్పబడినది.

తన చిన్ననాటి ప్రియురాలు, ఇప్పుడు పరవనిత అయిన యువతి తాను వారియింటికి ఏదో పనిమీద వెళ్ళి కూర్చున్నపుడు 'చిల్లులు పడిన వస్త్రాన్ని ధరించి తనయెదుట సంచరించడం జరిగితే' ఆమె తన్ను ప్రేమిస్తూ తన పొందుకై తహతహ పడుతూన్నదని గ్రహించాలి.

ఉదాహరణకోసం పరవనిత అనిచెప్పడం జరిగిందేకాని, ధర్మబద్ధంగా వివాహం చేసికొన్న భార్యకూడ అత్తమామలయొక్క, ఆడుబిడ్డలయొక్క, ఇతర జనంయొక్క సమక్షంలో కూర్చున్న భర్తతో తన మనస్సులోని సంగమాశయాన్ని చెప్పడానికి సిగ్గుపడ్డదై ఈ వస్త్ర సంకేతాన్ని అవలంభింపవచ్చును.

ఆలుమగలు ఇద్దరు మాత్రమే యింటిలో నివసిస్తున్నవారైనప్పుడుకూడ ఆ యువతి సిగ్గుచేత తన మనస్సులోని కోరికనునోటితో చెప్పలేనిదై పతియెదుట యీ వస్త్రాధారణా సంకేతాన్ని అవలంభించ వచ్చును.

'చిల్లులుపడిన వస్త్రం' మన్మథునిచే పీడింపబడుతూన్నాను, అతడు నా మనస్సును తూట్లు తూట్లుగా గాయపరచాడు-అనడానికి సంకేతమై యున్నదనుటయే ప్రధాన విషయంకాని, పరవనితయే కావలెనన్న నియమంలేదు.

మిక్కుటమైన ప్రేమను సూచించడానికి-ఎఱ్ఱని వస్త్రము సాధారణ ప్రేమకు పసుపుపచ్చని వస్త్రము, విరక్తి సూచనకు కాషాయ వస్త్రము సంకేతములై యున్నాయి. అట్టి వస్త్రాలను ధరిం