పుట:NagaraSarwaswam.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

"ఒక యువతి, ఒక యువకుడు చాలకాలానికి వెనుక ఒకరినొకరు ప్రేమించి విహరించారు. కాని తరువాత కొన్ని కారాణాలవల్ల ఒకరి నొకరు దూరమైపోయారు. మరల కొంతకాలానికి ఇద్దరూ ఒకేఊరిలో ఉండడం సంభవించింది. వారికి ఆ చిన్ననాటి నెచ్చెలి ఈ యూరనే యున్నట్లు తెలిసింది. ఈ విషయం ఆ యువతికి, ఆ యువకునకు ఇద్దరకు తెలిసియున్నదే. అయినా ఎవరిమట్టుకు వారు వెనుకటి ప్రేమ నిలచి యున్నదో లేదో అని సందేహిస్తున్నారు.

అట్టి పరిస్థితిలలో ఆ యువతి వద్ధనుండికాని, యువకునివద్దనుండి కాని—రెండు పగడాలు పొట్లాముగా కట్టి పంపబడితే- ఆ పంపినవారు తమ్ము ఇంకను ప్రేమిస్తూనే ఉన్నారని, తమయొక్క చిరకాల సమాగమాన్ని సూచిస్తున్నారని నాగరకులు గ్రహించాలి.

"నేను నీ మీది నలవు నిలుపలేక, దానివల్ల జ్వరంవచ్చి బాధపడుతున్నాను."—అని చూచించడానికి—'చేదుగా, కారంగాఉండే ద్రవ్యాలను పొట్లముగాకట్టి పంపుట' సంకేతముగా చెప్పబడ్డది.

"నేను నిన్ను ఇప్పుడే కలియగోరుతున్నాను. ఆలస్యానికి సహించలేను"—అనుటకు—"ద్రాక్షపండు పొట్లముగాకట్టి పంపుట"—సంకేతమై యున్నది.

అట్టి పొట్లమును ఏ యువతి అయినా తనయొద్దకు పంపినపుడు యువకుడామె వెంటనే తన్ను కలియుటకై రమ్మంటూవున్నదని గ్రహించాలి.

'నా శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను'—అనుటకు ప్రత్తిని పొట్లముగాకట్టి పంపుట—సంకేతమై యున్నది.

'నా శరీరాన్నేకాదు, ప్రాణాలనుకూడ నీకై అర్పిస్తున్నాను'-అనుటకు జీలకఱ్ఱను పొట్లముగాకట్టి పంపుట సంకేతము.

'నేను నిన్ను కలియగోరుతున్నాను. కాని ఏది యెటువస్తుందో అని మిక్కిలి భయముగా వుంది'—అని భీతిని సూచించడానికి 'జీడిని పొట్లముగాకట్టి పంపుట' సంకేతము.