పుట:NagaraSarwaswam.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


వుంటూకూడ సంకేతశాస్త్రమునందు నిపుణ అయిన యువతి తాను కోరినవానిని కలిసి ఆనందించగలదవుతుంది. ఆమె వీరందరి యెదుటనే తన రహస్యం ఎరిగిన చెలికత్తెతో లేక దూతికతో-"ఏమే! నాకు ఏమీ తోచడంలేదు. నేనలాతోటలోనికి పోతున్నాను. ఈవేళ" దానిమ్మపండు" తినాలని వున్నది. బజారుకుపోయి మంచి దానిమ్మపండు అలా తోటలోనికి తెచ్చిపెట్టు"-అని చెప్పడం జరిగితే-అక్కడ వున్నవారు ఆమె ఏదో దానిమ్మపండు తినాలనుకొంటోంది-అని తలుస్తారేకాని-తనకు ప్రియుడైన బ్రాహ్మణ యువకుని తీసికొని రమ్మంటూ వున్నదని, వానితో కలిసి ఏకాంతంగా తోటలో విహరించే తలపుకలదై ఉన్నదనీ, భావించలేరు.

ఇలా వివిధవిధానాలలో ఈ సంకేతాలను కాముకులు వుపయోగిస్తూంటారు. సంకేతాలు ఇవే అయి ఉండాలన్న నియమంకూడలేదు. శాస్త్రంలో ఈ సంకేతాలు చెప్పబడ్డాయి. కాముకులు క్రొత్త సంకేతాలను సృష్ఠించుకొంటూ వుండడంకూడ లేకపోలేదు. ఏసంకేతమైనా పరస్పరం అవగాహనచేసికొనడానికి వీలుకలదై వుంటే బాధలేదు.

ఒకచోట ఒక వేదపండితుడు భోజనంచేసిన తరువాత శిష్యుని పిలచి-ఏమిరా! బంధువును తీసికొని వచ్చేవా? అన్నాడు.

ఆ శిష్యుడు "లేదండి"-అని సమాధానం చెప్పి పరుగెత్తిపోయి ఒక పావుగంటకు తిరిగివచ్చి ఒక పొగచుట్ట గురువుగారి యెదుట వుంచాడు.

ఆ పండితుడు-"అమ్మయ్య"-అని చుట్టనోటబెట్టి నిప్పు ముట్టించాడు. ఎదుట వున్నవారు-ఏమండీ! మీరు బంధువును తెమ్మంటే శిష్యుడు చుట్టతెచ్చాడేమిటి? అని ప్రశ్నిస్తే ఆ పండితుడిలా అన్నాడు.

"బాబూ! "బంధువు" అంటే "చుట్టము" అనికదా అర్థము! "చుట్టాలు, చుట్టములు, చుట్టలు"-ఇవన్నీ సమానార్ధకాలు (రూపాంతరాలు) అందుచే కొంత గూఢంగావుంటుందని "బంధువును తెమ్మ"ని