పుట:NagaraSarwaswam.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


గానే ఆమె-అతడెవరో బాటసారి అనీ, రాత్రిగడపే ఉద్దేశంతో వచ్చాడని గ్రహించింది. అయితే అతని రూపం చూచినమీదట ఆమెలో ఏవో వింత ఆలోచనలు రేకెత్తాయి. ఆమె పల్లెపట్టున నివసిస్తూవున్నా నాగరకతనెరిగిన యువతి. అందుచే తనకోరికను స్పష్టంగా చెపితే ఎవరైనా గ్రహిస్తారనుకొని ఇలాఅన్నది.

“ఏమయ్యా ! నీవుచూస్తే బాటసారివిలా వున్నావు. సాయంకాలం అయింది. చీకటి పడుతూన్నది. కనుక ఇక్కడ తలదాచుకొందామని వచ్చివుంటావు. కాని ఇక్కడ నాపరిస్థితి నీకు తావియ్యడానికి అనుకూలంగాలేదు. ఏమంటావా ! నా భర్త వర్తకం చెయ్యడానికి దూరదేశాలకు వెళ్లేడు. ఎక్కడ వున్నాడో ఎప్పుడు వస్తాడో అన్న వార్తైనా తెలియదు. ఇక యింటిలో పెద్దదిక్కుగా వున్న అత్తగారు కూడ ఈ రోజు వుదయమే కూతురుకు పురుడువచ్చినదన్న వార్తరావడంతో అల్లుని యింటికి వెళ్ళింది. నన్ను చూస్తున్నావుకదా! నేను నవయువతిని. ఒంటరిదానను. అందుచే ఈ రాత్రి నీవు మాయింటిలో ఎలా గడుపుతావు? నీవు వేరొకచోటుకు వెళ్ళడం మంచిది" - అన్నది.

"నా భర్త ఊరిలోలేడు, అత్తగారుకూడలేదు. నేను యువతిని భర్త చిరకాలమై దేశాంతరం వెళ్ళినందున కామార్తనై వున్నాను. ఈరాత్రి యిచ్చట వసించి నన్ను స్వేచ్ఛగా అనుభవించు”- అన్నదే ఆమె మాటలలోని గూడార్ధం.

కాని ఆపథికుడు తెలివిలేనివాడై - ఆమె మాటలలోని సంకేతం తెలియనివాడై- వీలు లేదంటున్నదికదా అని వెనుదిరిగి వేరొకచోటికి వెడితే ఆ పడతియొక్క తిరస్కారానికి పాత్రుడుకాక తప్పదు.

నాగరకులైన స్త్రీలయొక్క, మాటలను అర్ధం చేసుకొనడానికి ప్రత్యేకమైన తెలివివుండాలి. ఆ తెలివిలేనివాడు పురుషుడెంత యువకుడైనా ఎంత సొగసుకాడైనా యువతులచే పరిత్యజింపబడతాడు. అందుచే నాగరక వనితల అనురాగాన్ని సంపాదించగోరే పురుషుడు