పుట:NagaraSarwaswam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఇంటిలో అవసరమైన పాత్రలు మొదలగునవి ఎలాగా ఉంటాయి. అవికూడ సుందరంగా ఉండేలా చూచుకొనాలి. ఇంటియొక్క ప్రతి ద్వారానికి రంగురంగు వస్త్రాలతో పరదాలు ఉంచడం కూడ అవసరం, అవి గృహంయొక్క అందాన్ని ఇనుమడింపజేస్తాయి.

గోడలకు వ్రేలదీయబడిన చిత్రాలను అందమైన పూలమాలలతో అలంకరిస్తూండడం. గృహాన్ని అగరు ధూమంతో సువాసనా వాసితం చెయ్యడంకూడ అవసరం.

నాగరకులు తమ యింటిలో వ్యాయామ సాధనాలనుకూడ జాగ్రత్తచేసి ఉంచుకొనాలి. ఏమంటే అవి నిత్య వ్యాయామానికి ఉపయోగిస్తూ శరీరారోగ్యాన్ని కాపాడుతూ వుండడమేకాక చూపరకు- "ఇతడు కేవలం పిండి బొమ్మకాదు. శరీరంలో తగినంత పిండి వున్నవాడే"- అన్న భావం కలిగిస్తాయి.

గృహంలోని ఆసనాలు, మంచాలు చిత్రచిత్రాలంకారాలతో తేజరిల్లేలా చూచుకొనాలి. మంచాలు, కుర్చీలు కంపించే లక్షణం కలవి (స్ప్రింగు ఇచ్చేవి) అయివున్నప్పుడు చూచేవారిని అవి వెంటనే ఆకర్షిస్తాయి. అంతేకాదు-ఆవచ్చిన వారి మనస్సులో ఆ స్ప్రింగుమంచంమీదనో లేక కుర్చీమీద ఒకసారి కూర్చొవాలన్న కోరికకూడ కలుగుతుంది. ఆ వచ్చినవారి అనురాగాన్నే కోరియత్నించేవాడైనప్పుడీ నాగరకుడు వారిమనస్సులోని కదలికను కనుపెట్టి ఆదరంగా- "కూర్చో! కూర్చో! బాధలేదు” అంటూ వారిని అందు కూర్చుండబెట్టి వారి మనస్సులోని అనురాగానికి దోహదం చెయ్యడానికికూడ వీలుకలుగుతుంది.

ఇక ఇంటి ముంగిలియుందు, పార్శ్వభాగములయందు సుందర పుష్పవృక్షాలను, చిన్న జలాశయాలను (ఇప్పుడు ఫౌంటైన్) ఏర్పచుటద్వారాకూడా ఇంటియొక్క అందం పెరుగుతుంది. చిలుకలు, పావురములు మొదలగు మధురంగా కూసే పక్షిజాతులు తమ గృహ ప్రాం