పుట:NagaraSarwaswam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19


కామపీడితయై వలచి వచ్చిన వనితను ఇహలోక సుఖంకొఱకు కాకపోయినా పరలోక సుఖంకొఱకైనా తీరస్కరించకూడదు.

మరియొక విషయం- కామ పీడితయై తన భార్యయే తన సన్నిధికివస్తే ఆమెనుచూచి తాను కామానికి వశంకాకుండా ఆమెకు నిత్య తృప్తిని కలిగించే పురుషుడుకూడ దేహావసానమున ఉత్తమ లోకాలకు చేరుకొంటాడనికూడ చెప్పబడ్డది.

స్వయంగా వలసి వచ్చిన వనితను చూచినప్పుడు పురుషుని మనస్సులో ఉత్కటమైన కోరిక ఉదయిస్తుంది. అలా పురుషుడు ఉత్కటమైన కోరిక కలవాడైనప్పుడు ఆ వనితకంటెముందు తానే తృప్తిచెంది తరువాత ఏమియు చేయలేనివాడవుతాడు. అందుచే అతడు తన కోరికను నిగ్రహించుకొని– అంటే తాను ఒక రకంగా మానసికంగా కామరహితుడై ఆమెను కలిసినప్పుడు మాత్రమే ఆమెకు తృప్తికలిగించగల వాడవుతాడు. కాంతా పరితృప్తికై ఇట్టి నిగ్రహాన్ని అవలంబించే వానికి ఉత్తమ గతులు కలగడంలో ఆశ్చర్యంలేదు. అందుచే కామ శాస్త్రాలన్నవి ఎంతమాత్రమూ నిందింపదగినవి కావు.

నాగరసర్వస్వం అనబడే ఈ కామశాస్త్రాన్ని చక్కగా చదివి అచరణలోపెట్టి ఎవరైనా ధనధాన్యాదికాన్ని సంపాదించదలిస్తే అవి వారికి సులభంగానే లభిస్తాయి. అంతేకాదు. ఈ శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలయందు శ్రద్ధకలిగి యత్నించేవారికి పుత్రుడు జనించాలని కోరిక ఉంటే పుత్రుడు, పుత్రిక జన్మించాలన్న కోరికఉంటే పుత్రిక జన్మిస్తారు.

మిక్కిలి కోరికతో తనవద్దకు వచ్చిన మదవతియైన వనితను పురుషుడు శాస్త్రము వివరించిన విధానములో కలిసి ఆమెయొక్క యోని యందు బీజవ్యాసం (వీర్య విసర్జన) చేస్తే ఆమె అరమోడ్పుకనుగవతో పరవశయై మిక్కిలిగా ఆనందించినదై ఆ ఫురుషునకు తన శరీరాన్నే కాదు తనయొద్దనున్న ధనాన్నికూడ కొల్ల బెట్టేది అవుతుంది. అందుచే ఇహముపరము చెడకుండ కాపాడుకోవాలనుకునేవారు కామశాస్త్ర గ్రంథాలను అభ్యసించితీరాలి.