పుట:NagaraSarwaswam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18


యాన్నైనాసరే! నేను లలితంగా సుందరంగా ఉపాసిస్తాను."- అని చెప్పుకొనే మానవుడు కామవిషయంలో మంచి శాస్త్రగ్రంధాలు చదువక—చిత్రచిత్ర రతిక్రీడావిధానాలు— ఉపచారవిధానాలు తెలిసికొనక కాంతలతో కాముకుడై విహరిస్తే— వాని విహారానికి, ఆ ఆబోతు విహారానికి తేడా ఏముంటుంది!

అందుచే మానవుడు తన నాగరకతా లక్షణానికి అనుకూలమై సుందరమైన సంవిధానంలో కామాన్ని ఉపాసించాలి—అనుభవించి ఆనందించి, ఆనందింపజేయాలి—అంటే శాస్త్ర గ్రంథాలు చదవడం అవసరం. అందుకొఱకే ఈ గ్రంధం రచింపబడుతూన్నది.

వయస్సులోని సొగసుకత్తె మదవతియై అధిక కామంకలదై మిక్కిలిగా బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెయందు దయగలవాడై, స్వార్థరహితుడై పురుషుడామెకు పూర్ణమైన తృప్తిని కలిగించగలిగితే–వానికి ఈ పుడమియే స్వర్గం అవుతుంది. తనవల్ల అలా తృప్తిపొందిన పడతిచే ఆ పురుషుడు నిరంతరం ఆరాధింపబడుతూ స్వర్గసౌఖ్యాలను ఈ పుడమియందే అనుభవింపగలవాడవుతాడు. అయితే అలా కామార్తయైన వనితయొక్క భావాన్ని గుర్తించి ఆమెను కలిసి తాను తృప్తిపొంది ఆమెకు తృప్తి కలిగించడానికి మంచి శాస్త్రగ్రంధాలు చదివి వాని ఎఱుక సంపాదించడం అవసరం.

అలా కామంతో బాధపడే పడతి పరవనిత అయినప్పటికి ఆమెను కలిస్తే పురుషునకు పుణ్యమే లభిస్తుంది, కాని పాపం కలుగదు. అట్టి వనితను కలియడానికి పాపభీతితో నిరాకరిస్తే పాపంకలుగుతుంది. మహాభారతంలో కామాంతురయై స్వయంగా (తన ప్రయత్నం ఏమీ లేకుండా) కోరివచ్చిన వనితను తిరస్కరించి ఆమెను కలియనిరాకరించిన పురుషుడు దేహాసానమున నరకానికి చేరుకొంటాడని, 'వాని నిటూర్పులు సోకినవానికల్లా పాపం అంటుతుందని చెప్పబడ్డది.[1] అందుచే


  1. కామార్తాం స్వయ మాయాతాం యోనభుంక్తే నితంబినీం
    సోవశ్యం నరకం యాతి తన్నిశ్శ్వాస హతోనరః :