పుట:NagaraSarwaswam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16


నేర్పుతుంది. నాగరికునియందు అనంత విలాసాలను నిక్షేపిస్తుంది. విలాసి జనానికి విశ్వాతిశాయి సౌఖ్యాన్ని అందజేస్తుంది. సంస్కృత భాషయందున్న యీగ్రంధము సర్వులకు చదువుట సాధ్యముకాదు. అందులకే ఈగ్రంధము తెనిగింపబడుచున్నది. ఈ అనువాదమున అవతారికాభిప్రాయములు వ్యాఖ్యాసదృశములు అయిన విషయములనేక ములున్నను మూలమును విడిచిన అకాండతాండవము మాత్రముకాదు.

ఇట్టి గ్రంధమొకటి సంస్కృతమునం దున్నదనియైన యెఱుంగని నన్ను- శ్రీరాంషాగారు అనువాదము చేయుడని పోత్సహించినారు కాగా వ్రాసినది నేనే అయినను వ్రాయించినది రాంషాగారు. ఆయన ఉత్తమ రచనలకేకాదు, రచయితలకును న్రష్ట. ఆయనకు నమస్సులు. ఈగ్రంధమును జదువు పాఠకులకు అభినందనలు.

ఇట్లు,

"అరుణకిరణం"