పుట:NagaraSarwaswam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

నాగర సర్వస్వమననేమో తెలుపుటకీ కథ చెప్పబడినది. కామినీ కాముకులు పరమ నాగరికులైనపుడు తమ సంకేతముల నితరులు గుర్తింపనటులు ప్రవర్తించు స్వభావముకలవారై యుంటారు. ఆ సంకేత మర్మములు తెలియనినాడు స్త్రీయైనను పురుషుడైనను-ఇట్టి సంకేతములతో తమ యెదుటకు వచ్చిన సౌఖ్యమును అనుభవింప జాలనివారే అవుతారు. ఇట్టి కళాపాండిత్యముకల స్త్రీలు అరుదుగా వుంటారు. అట్టివారితో సాంగత్యము దుర్లభము. అయినను ఒకవేళ అట్టి స్త్రీ తన్నువలచి సంకేతమును దెలిపినచో శాస్త్రము తెలియనివాడు తెల్లబోవుట దక్క చేయునది యుండదు.

లోకమునందలి యిట్టి నాగరిక సంకేతములను, ఇంకను అనేక విషయములను శాస్త్రగ్రంధములనుండి యేర్చికూర్చి పద్మశ్రీ అను పేరుగల బౌద్దయతి యీ నాగరసర్వస్వమును సంస్కృతంలో రచించారు. గంధాంత మందాత డిట్లు చెప్పుకొన్నాడు.

ఆసీద్భ్రహ్మకంలే కలాగ్రనిలయో యోవాసువః కృతీ
తస్యస్నేహవశా చ్చిరంప్రతిముహృ స్సంప్రేరణాత్ నాంప్రతం
దీప్తేయం రతిశాస్త్రదీపకలివా పద్మశ్రియా ధీమతా
హృద్యార్ధాన్ ప్రకటీకరోతు జగతాం సంహృత్యహార్దుతమః

వాసుదేవుడను విప్రు డొకడు కలడు. అతడు సకలకలాకోవిదుడు చతురుడు. అతడు మాటిమాటికి ప్రోత్సహింపగా పద్మశ్రీ అను పేరుగల బౌద్ధయతి రతిశాస్త్రములకు దివ్వెవంటిదైన ఈనాగర సర్వస్వమును రచించాడు. ఈ గ్రంధము రమ్యార్ధములను వెల్లడించుచు అజ్ఞానమను చీకటిని హరించి లోకమున చిరకాలము వెలుగులు చిందుగాత!

వాస్తవమున కీ నాగర సర్వస్వము చదువుటవలన హృదయము నందొక వింత వెలుగు ప్రసరిస్తుంది. గ్రంధమును పఠించినగాని ఆ నలుగు మనస్సున కంటదు. యీ నాగర సర్వస్వం అనాగరకునకు నాగరత