పుట:NagaraSarwaswam.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160


అనువాదకుని తుదిపలుకు

ఈ గ్రంథకర్తయైన పద్మశ్రీ తన గ్రంథంలో సుగంధ ద్రవ్యాలను కొన్నిటిని తయారుచేసుకొనే విధానాలు చెప్పేడు. అక్క డక్కడ దంపతులు శరీరసౌష్ఠము చెడకుండా కాపాడుకొనేందుకు ఉపయోగించే ఓషధులను, దాంపత్య జీవనంలో దైవానుగ్రహం ద్వారా ఆనందం పొందడానికి వీలుగా మంత్రాలను ప్రస్తావించి ఉన్నాడు.

కాని నేటి లోకం ఆ ఓషధులను సంపాదించి వానిని యుక్తవిధానంలో ఉపయోగించుటయందు అసమర్థమైనది. అదీకాక ఓషధులపేర్లు చెప్పినంత మాత్రంలో వానిని గురుతించడం అందరకు సాధ్యం కాదు. గుర్తించగలిగినా అన్ని ఓషధులు అందరకు సులభసాధ్యాలు కావు. సుగంధద్రవ్యాలు బజారులో దొరకుతున్నాయి. గనుక వానిని తయారుచేయడానికై ప్రత్యేకం ఇంటిదగ్గర శ్రమపడడం పనిలేని పని. ఇక మంత్రాలున్నాయి. వానియందు నేటి లోకానికి విశ్వాసంతక్కువ "మననాత్ త్రాయత ఇతి మంత్రపి" జపింపగా రక్షించునది మంత్రము. ఉచిత విధానములో శ్రద్ధావంతుడై శుచియై జపించువానికి మంత్రము నిష్ప్రయోజనముకాదు. తేలుమంత్రము, పాముమంత్రము ఇప్పటికిని ఉపయోగిస్తూనే ఉన్నాయి. అయినా తగిన శ్రద్ధ, పవిత్రత, లేనిచోట మంత్రాలు బూడిదలోపోసిన పన్నీరు. నేటిలోకంలో మంత్రజపయోగ్యత కలవారు అరుదు. అందుచే ఈమూడు విషయాలు అనువాదక్రమంలో పరిహరింపబడ్డాయి. ఇట్లు పరిహరించుటద్వారా ఈఅనువాదం సర్వులకు నిరాపదమైన విజ్ఞానాన్ని అందీయగలదని భావింపబడ్డది, ఈ గ్రంధము దంపతీ సౌఖ్యనర్ధకమైనది. దంపతులు దీని నాదరింతురుగాక

ప్రాప్నుతాం ప్రవిమలసౌఖ్య మఖిల దంపత్!