పుట:NagaraSarwaswam.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155


లయందు, మాటిమాటికి మిక్కిలి తరచుగా బంధువుల ఇండ్లకు వెళ్ళివచ్చుటయందుకూడ పురుషుడు భార్యారక్షణంలో కనుగలిగి, సాధ్యమైనంతవరకు అట్టి యాత్రలను రాకపోకలను నిషేధించాలి. ఇక తనభార్య పొలమునకు వెళ్ళి పనిచేసి వచ్చేదై ఉన్నపుడు పురుషుడు నిత్యము జాగ్రతకలవాడైఉండాలి. అతడు దుశ్చరిత్రలైన వనితలతో తనభార్యను కలిసి తిరుగనీయరాదు.

ఏమంటే - ఆమె భార్య స్వయంగా మంచినడవడి కలదై ఉన్నప్పటికి తన యెవనోద్రికం వలనకాని ఇతరుల ప్రయత్నాల వలన గాని శీలాన్ని కోల్పోవచ్చును. ఒక్కొక్కప్పుడు ఆమె శీలాన్ని ఆమెకు దగ్గరబంధువులైనవారే హరించవచ్చును. 'నీకుపుణ్యంఉంటుంది అంగీకరించు, అంగీకరించకపోతే నేను చచ్చిపోతాను, ఈపాపం నీకు వస్తుంది' - అంటూ పుణ్య పాపాలను అడ్డంపెట్టుకొనికూడ ఆమె శీలాన్ని ఎవరైనా పాడుజేయవచ్చును. ధనాశ కల్పించి శీలభ్రష్టను చేయవచ్చు. నూతిక ఏవో కల్లబొల్లికబురులు చెప్పి, ఆమెకు ఏదో స్వర్గసౌఖ్యం అరచేతిలోచూపిస్తే గూడ ఆమె దారితప్పవచ్చును. అందుచే వారు దారితప్పడానికి ఉన్న అవకాశములన్నిటియందును పురుషుడు జాగరూకుడై ఉండాలి. అంతేకాని 'నాభార్యశీలవతి, పతివ్రత' అనుకొని కండ్లుమూసుకొని కూర్చుంటే ఆవలివాడు చాతుర్యంతో ఆమెశీలాన్ని హరించవచ్చును. తీరాచేసి జరుగకూడని ఆపని (శీలంచెడడం) జరిగినమీదట ఈభర్తఏమిచేసినా ప్రయోజనం శూన్యమే. అందుచే స్వభార్యా శీలరక్షణంలో ప్రతిపురుషుడు అప్రమత్తుడై ఉండాలి. సుందరులైన పురుషుల ఎదుట ఆమెచేష్టలు ఎలాఉన్నాయి. అన్నవిషయం వివేకంతో పరిశీలిస్తూ ఉండాలి.

ఇలా చెప్పబడ్డదికదా అని భార్యను ఎల్లపుడు అనుమానిస్తూ ఆమెకు కాలు కదపడానికికూడ అవకాశమీయక భర్తద్వారాపాలకుడై కూర్చుంటే - ఆమె ఎవరిద్వారానో ప్రేరితయైకాక తనంత