Jump to content

పుట:NagaraSarwaswam.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154


వివరించి వివరించి - ఆదూతిక ఆయువతి మనస్సు స్వాధీనం తప్పునట్లు, ఆ పరపురుషునిపై లగ్నమగునట్లు చేయాలి. ఈ పనిచేస్తూ దూతిక అనుక్షణము ఆవనితయొక్క మనస్సులోని భావాలను ఆమె ముఖలక్షణాలద్వారా గ్రహిస్తూ తగినట్లు వ్యవహరించాలి అప్పుడా యువతి మానసంలో మన్మధుడు తిష్ఠ వేసుకొని కూర్చుంటాడు, ఆమెలో కామాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అపుడామె బిగింపు విడచి తన అంగీకారము నామెకు తెలుపుటయేకాక తల్లివెంట బిడ్డ నడచినట్లు దూతిక వెంటనడచి వెడుతుంది.

ఈపనిని సాధించుటకు దూతికకు ఎంతకాలం పడుతుంది? అన్న విషయం ఆదూతిక నేర్పుమీది ఆపరవనితయొక్క బిగింపుమీద ఆధారపడిఉంటుంది. దూతిక నేర్పుకలదై ఉండి ఆ పరవనితలో బిగింపు తక్కువగావుంటే ఒకటి రెండురోజులలోనే కార్యం సఫలంకావచ్చును. అట్లుకాక ఆపరవనితలో బిగింపు ఎక్కువగాఉంటే దూతిక అప్పుడప్పుడువెళ్ళి తనకార్యానికి అనుకూలములైన మాటలు చెబుతూ క్రమంగా కార్య సాఫాల్యాన్ని సాధించాలి.

ఈవిధంగా పరస్త్రీలకొరకై లోకంలో ప్రయత్నించడం జరుగుతూఉంటుంది. కనుక పురుషుడు తనభార్యను కాపాడుకొనడంలో శ్రద్ధకలవాడైయుండాలి.

స్వభార్యాలక్షణోపాయములు

పురుషుడు భార్యతో పరుషంగా మాట్లాడకూడదు. ఆమెను ప్రేమగా ఆదరిస్తూ ఆమెతో ఏవిషయంచెప్పినా, మృదువుగా మధురంగా చెప్పాలి. ఊరిబయట తోటలలో విహరించడానికి తీర్ధాలలో సంచరించడానికి, సామూహిక ఉత్సావలలో పాల్గొనడానికి భార్యను పురుషుడు నిషేధించాలేకాని అనుమతించకూడదు. ఒకవేళ అనుమతించినా తాను ఏమరుపాటు వహించరాదు. అంతేకాదు, ఇరుగుపొరుగుల తగవులాటలోకూడ తన భార్య పాల్గొనకుండా పురుషుడు జాగ్రత్త తీసుకొనాలి. తీర్థయాత్ర