పుట:NagaraSarwaswam.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142


అయినావీరు సుందరయువకుడు కంటబడినంతనే కామాసక్తిని కండ్లలో వ్యక్తపరుస్తారు. రతివేళ వీరు ఆలింగన చుంబనములయందు ఆసక్తిని ప్రదర్శిస్తారు. నఖక్షత దంతక్షతములయందును, అంగుళీప్రవేశ, క్రీడా తాడన, శరీరమర్ధనములయందును వీరు ఆసక్తిని చూపరు.

ఈవిధముగా దేశభేదమునుబట్టి స్త్రీలయొక్క అభిరుచులు, స్వభావములు భిన్నంగా ఉన్నాయి. వారివారి సకృతులకు అనుకూలముగా వర్తించినపుడు మాత్రమే భర్తవలన వారికి వారివలన భర్తకు ఆనందము కలుగుతుంది. అట్లుకాక వారిప్రకృతికి విరుద్ధంగా భర్త వర్తించిననాడు ఉభయులకును సుఖముకలిగే అవకాశములేదు. చలి గడగడ వడకిస్తూఉన్నపుడు వింజామరగాలి ఎవరికిని సుఖాన్నికలిగించదు కాని ఆ వింజామరమే ఉష్ణకాలమునందు, ఉష్ణదేశమునందు సుఖదాయకం అవుతుంది. అట్లే భిన్న దేశములోని స్త్రీలు భిన్నాభిరుచులు కలవారై ఉండుటచే పురుషుడు ఆ యా దేశప్రకృతులకు అనుకూలములైన రతివిధానముల నవలంబించాలి.

ఈ ప్రకరణంలో పద్మశ్రీ ఆంధ్రదేశ గూర్జరదేశ (గుజరాత్) స్త్రీల స్వభావములనుగూర్చి చెప్పలేదు. ఆ దేశ స్త్రీల స్వభావములు రతిరహస్యమునం దీవిధముగా చెప్పబడ్డాయి. ఆంధ్రదేశస్త్రీలు :- వీరు సుకుమారంగా ఉంటారు. రతియందు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. వీరు రతివేళ భర్తకు తనకు తృప్తికలిగి భావనానాన దశకు వచ్చియున్నపుడు కూడ తమ మర్మావయవముతో అల్పవీర్యమైన పురుషావయవమును బిగియబట్టి భర్తను ప్రోత్సహించి ఆనందించే స్వభావము కలవారై ఉంటారు. ఘూర్జరదేశస్త్రీలు ఘూర్జరమనగా నేటిగుజరాత్. ఈదేశపుస్త్రీలు వరలుకొప్పులతో, బిగువుచన్నులతో సుందరనేత్రములతో మధురభాషేణులై బాహ్య - అభ్యంతర రతుల యందు రెండింటియందును ఆసక్తి కలవారై ఉంటారు.

★ ★ ★