పుట:NagaraSarwaswam.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141


మొత్తం 64. వీనిని సగము వాత్స్యాయనుని కామసూత్రము లందు చూడదగును) వీరియందును కామముయొక్కపాలు ఎక్కువగానే ఉంటుంది. అయినా వీరు కృత్రిమ పురుషాంగమును వాంఛింపరు. ఆలింగన చుంబనములయందును, అంగుళీ ప్రవేశము అందును అభిలాష కలవారై ఉంటారు.

11. ద్రవిడదేశస్త్రీలు :- ద్రవిడదేశమనగా తమిళదేశము. ఈ దేశస్త్రీలు అలంకారప్రియులై ఉంటారు. వీరికి ఆలింగన చుంబనములయందు అభిలాష ఎక్కువ. అందున జిహ్వాప్రవేశ చుంబనముపై వీరికి మక్కువఎక్కువ. రతివేళ పతి తమ్ముతాడించి తమశరీరము నందు మాంసరములైన భాగములను బాగుగమర్దించి, తమజుట్టును లాగి చికాకుపరచుటద్వారా వీరు ఆనందించేవారై ఉంటారు.

12. వంగ - గౌడదేశస్త్రీలు :- వంగ దేశమనగా నేటి భెంగాల్. నేటిబిహారుకును అంటియున్న ప్రాంతము (ఒరిస్సా) పూర్వము గౌడదేశమని పిలువబడెడిది. ఈ రెండుదేశములలోని వనితలు లావణ్యముతో నిండిన శరీరాలుకలవారై ఉంటారు. ఆలింగన చుంబనముల యందు, అందున అధరోష్ట (క్రిందిపెదవి) పానమునందు వీరికి అభిలాష ఎక్కువ. అభ్యంతర రతియందు వీరు కనబరచే ఆసక్తి మనోహరంగా ఉంటుంది. వీరు మదురంగా మాట్లాడుతారు. తీర్థయాత్రలయందు వీరికి మక్కువ ఎక్కువ.

13. నేపాళ - కామరూప - చీనాదేశస్త్రీలి :- నేపాళము ప్రసిద్ధము. కామరూపమనగా నేటి అస్సాము ప్రాంతము. ఈ రెండు దేశములలోని వనితలును, చీనాదేశవనితలును సమానమైన స్వభావాభిరుచులు కలవారై యుంటారు. వీరు అలంకారప్రియులై కళా పాండితికలవారై, మధురభాషిణులై ఉంటారు. వీరుమందవేగలు అనగా అల్పకామంగలవారు. అల్పకాలిక రతిక్రీడచే తృప్తిచెందుతారు