పుట:NagaraSarwaswam.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140


జన్మించిన వనితలు సహజంగా ఆచారహీనలై ఉంటారు. వీరు రతివేళ పతి తమ్ము అధికంగా తాడించుటద్వారా ఆనందిస్తారు.

8. స్త్రీరాజ్య-కోసలదేశస్త్రీలు : - ప్రస్తుతము 'భూటాన్‌' అని పిలువబడు ప్రాంతమునే పూర్వము స్త్రీరాజ్యమను పేరుతో పేర్కొనేవారు. అయోధ్య అనే నగరాన్ని నేటి మనదేశ పటమునందు గుర్తింపవచ్చును. ఈనగరము మనదేశములో ఉత్తర ప్రాంతమునందున్నది. ఈనగరప్రాంత దేశము పూర్వము కోసలదేశమని పిలువబడేది.

ఈరెండు ప్రాంతములయందలి స్త్రీలు వివిధాలింగన చుంబనములందును ఉత్థిత (నిలువబడి రమించుట వ్యానతకరణము (పశువువలె వంగియుండగా రమించుట) ల యందును అనురక్తికలవారై ఉంటారు. వీరు దీర్ఘ కాలికమైన రతినికోరే చండవేగలైఉంటారు. అందుచే పురుషుడు వారిని తృప్తిపరచుటకు కృత్రిమ పురుషాంగమును (పురుషాంగమువలె తయారుచేయబడిన కఱ్ఱ లేక వేరొక ధాతువు) ఉపయోగించుట పూర్వము ఆచరణలో ఉండేది.

9. కర్ణాటదేశస్త్రీలు : - కర్ణాటదేశ మనగా కన్నడదేశము కన్నడదేశములోని స్త్రీలు స్త్రీరాజ్య కోసలదేశ స్త్రీలవలె అధిక కామం కలవారై దీర్ఘ కాలిక రతియందాసక్తి కలవారై ఉంటారు. అందుచే ఈదేశ స్త్రీల విషయమునందును పూర్వము కృత్రిమ పురుషాంగము నుపయోగించుట ఆచరణలో ఉండేది. అధికకామం కలవారైనందున ఈస్త్రీలు మదవతీ లక్షణాన్ని సార్ధకపరచే శరీరాలు కలవారై ఉంటారు. వీరు రతివేళ పతిచేసే తాడానాలను ఆనందంతో స్వీకరిస్తారు. వీరికి 'అంగుళీప్రవేశము' నందును ఆసక్తి ఎక్కువ.

10. మహారాష్ట్రస్త్రీలు :- మహారాష్ట్రదేశము సుప్రసిద్ధము. ఆ దేశములోని వనితలు సకలకళా నిపుణులై ఉంటారు. (కళలు