పుట:NagaraSarwaswam.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139

3. సింధుదేశస్త్రీలు :- మన దేశమునందలి నేటి పంజాబు ప్రాంతమును పశ్చిమ పాకీస్తానమును పూర్వము సింధుదేశమని పిలుచుచుండువారు. ఈప్రాంతమున జన్మించిన స్త్రీలు వ్యానత కరణము (స్త్రీ తన పాదములను చేతులను నేలపైఆని నాలుగు కాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడ రమించు విధానము) నందు ఆసక్తి కలవారై ఉంటారు. గాఢాలింగన కేశాకర్షణములయందు వీరికి ప్రీతిఎక్కువ. వీరు నఖక్షత దంతక్షతములయందుకూడ అభిరుచి ప్రదర్శిస్తారు. ఆలింనాదికములైన బాహ్య రతివిధానము లన్నిటియందును ఆసక్తికలవారైన ఈస్త్రీలు అల్పమైన అభ్యంతర రతిచేతనే (సంభోగము) ఆనందించే వారై వుంటారు. అనగా వీరు దీర్ఘ కాలిక రతిని వాంఛింపరు.

4. కురు-మరు దేశస్త్రీలు :- మనదేశమునకు ఉత్తరమున హిమాలయము నంటియున్న దేశము కురుదేశము. ప్రస్తుత రాజస్థానము మరుదేశము. ఈ దేశములయందు జన్మించిన వనితలుకొండ్లలోకంటె కొండగుహలయందు, చిట్టడవులయందు కాంతునితో కలసి విహరించుటయం దాసక్తికలవారైవుంటారు.

5. సింహళదేశస్త్రీలు :- సింహళదేశము సుప్రసిద్దము. ఈ దేశమునందలి స్త్రీలు నానావిధ రతివిధానములందును ఆసక్తికలవారై నేర్పరులై వుంటారు.

6. కాశ్మీరదేశస్త్రీలు :- కాశ్మీరదేశము సుప్రసిద్ధము. ఈ దేశమునందలి స్త్రీలు చక్కని పనితనముకల సుందర వస్త్రాలను నిపుణముగా ధరిస్తారు. వీరు మిక్కిలి శుచి శుభ్రతకలవారై గుణవతులై ఉంటారు.

7. జలంధరదేశస్త్రీలు :- పంజాబుదేశమునందే ఉత్తరప్రాంతమున జలంధరనగరము ఉన్నది. ఆనగర పరిసరములయందు