పుట:NagaraSarwaswam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


డానికి నేను సాహసించలేదంటే తమ్ములను తోటమాలులుగ విడచి పెడుతున్నానన్నమాటయే కదా! అలాకాదు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పుటకు ఉద్యమించుటయే కర్తవ్యము. దైవము తోడ్పడెనా జయిస్తాను. లేదా తమ్ములను కలసికొంటాను.

అజయు డీవిధంగా ఆలోచిస్తూండగా ఆ భవనంలో నుండి ఘంటా నాదం వినబడ్డది. అజయుడా ధ్వనివిని ద్వారపాలకుని సమీపించి - ఆ ధ్వని ఏమని ప్రశ్నించాడు.

దానికి ద్వారపాలకుడు- స్వామీ! రాకుమారి యీ భవనములోనికి ఇప్పుడే వచ్చినది. ఆమె ప్రశ్నలకు సమాధాన మీయదలచు వారెవరైనా ఉన్నచో రావచ్చునని సూచించుటకు ఈ గంట మ్రోగింపబడినది.

అజయుడు వెంటనే నేనామె ప్రశ్నలకు సమాధానమిస్తాను నన్ను లోపలకు తీసికొనివెళ్ళు అన్నాడు.

ద్వారపాలకు డాతని యీ నిర్ణయానికి చకితుడయ్యాడు. కాని అతని నాపుటకు తానెవ్వడు? అందుచేత “రండి! రండి!” అని పిలుస్తూ ముందుకు నడచి మార్గము చూపసాగేడు.

ఆ భవనము మిక్కిలి విశాలమైనది. నానాలంకారములతో నిండినది. భవనములోని కడుగిడినంతనే కొందరు పరిచారకులు అజయుని పాదాలు కడిగి తడియొత్తారు. మరికొందరు నీరాజన మిచ్చారు. కొందరాతని నొక సుందరమైన గదిలోనికి గొనిపోయి మెత్తనైన సెజ్జపై

డబెట్టారు.

అజయుడా భనస సౌందర్యమును పరికిస్తూ ఆ రాకుమారి తన్నేమి ప్రశ్నిస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో ఒక పరిచారిక బంగారు పళ్ళెములో తీయమామిడి చివుళ్ళ అంకురములను బెట్టి తెచ్చి యాతనిముందు నిలువబడినది,