పుట:NagaraSarwaswam.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135


భర్తయొక్క ముఖము భార్యాముఖానికి కొంతదూరంలో ఉన్నది. ఆమెలో భర్త ముఖాన్ని చుంబించాలన్న కోరిక జనించింది. ఆమె తన ముఖమును భర్తయొక్క ముఖమునకు దగ్గరగా కొని వెళ్ళుటకు పూర్వమే నోరుతెరచి గాలిని లోపలికి పీల్చుచు - వేగముగా తన పెదవుల నాతని ముఖముపై చేర్చి చుంబించినది. అట్టి స్థితియందీ 'సింహకృతము' జన్మిస్తుంది. ఎట్లనగా ఆమె గాలి పీల్చువేళ జన్మించిన "హకార" ధ్వనివంటి ధ్వని. పెదవులు ఒక్కసారిగా భర్తయొక్క ముఖముమీద ఆన్చినంతనే "క్" అన్న ధ్వనితో సమాప్తం అవుతుంది. అందువలననే దీనికి 'హింకృతము' అన్న పేరేర్పడినది. రతిరహస్యకారుని హింకృతధ్వని లక్షణము దీనికంటె భిన్నమైనది. చూ - రతిరహస్యం.

6. దూత్కృతము :- మంచిముత్యము చేయిజారి మట్టినేలపై పడినపుడు "దత్" అన్న శబ్దం పుడుతుంది. సరిగా అట్లే రతివేళ భార్య భర్తను కృతకంగా "ధత్, దత్" అన్న శబ్దాలను పలుకుతుంది. అయితే అది రతిసమయముకనుక, ఎవరైనా వింటారన్న సంకోచముతో ఆమె ఆ శబ్దాలను చాలా అల్పధ్వనితో ఉచ్చరిస్తుంది. అపుడా శబ్దము "ఊత్, ఊత్" అనే శబ్దాలవలె వినిపిస్తుంది. ఇదుగో! భార్యాకంఠ నిర్గతమైన ఇట్టి ధ్వని విశేషము 'దూత్కారము' అనబడుతుంది.

రతిరహస్యమునందు "కూజతము" చెప్పబడలేదు. దానికి బదులుగా "రుదితము" (భర్తయొక్క చేతవలన నొప్పితోచి భార్య ఏడ్చుట) చెప్పబడినది.

ఈధ్వని విశేషములన్నియు సతీపతుల రతిక్రీడయందు ఆనంద వర్ధకాలై ఉన్నాయి.