పుట:NagaraSarwaswam.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134


ఆనందాన్ని తరంగితం చేస్తుంది. తమకు రతియందు తృప్తికలిగినపుడు స్త్రీలు గొంతు సవరించుకొంటారు. ఆ సవరించుకొనుటలో ఇట్టిధ్వని ఏర్పడుతుంది.

3. శ్వసితము : - శబ్దము వినబడునట్లు నిట్టూర్చుటయే శ్వసితము. రతివేళ (ఏ పురుషాయితమునో ఆచరించి) అలసినదై భార్య సశబ్దముగ నిట్టూర్చుట జరిగితే అది 'శ్వసితము' అనబడుతుంది.

4. సీత్కారము :- బాధను అలసటను సూచిస్తూ 'ఇస్‌' అని కొంచెం దీర్ఘంగా పలుకబడే ధ్వని విశేషమునకే సీత్కారమని పేరు. రతివేళ అలసిన భార్య ఒక్కొక్కప్పుడు తన అలసటను సూచించుటకును, భర్త తన శరీరముమీద తీసుకొనే దోరనను నిషేధించుటకును ఈవిధమైన ధ్వనిని ఆచరిస్తుంది.

5. పూత్కారము :- మండని పొయ్యిని మండించుటకు 'ఉఫ్ ఉఫ్‌' అని ఊది మండించుట లోకవిదితమే. మానవుడు బాగా అలసినపుడుకూడా సరిగా ఇట్లే దగ్గరగాజేర్చిన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తాడు. రతిసమయంలో బాగా అలసిన భార్య దగ్గరగాజేర్చిన తన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తూ 'ఉఫ్‌' అన్నధ్వనిని ఆచరించుట 'పూత్కారము' అనబడుతుంది. పూత్కారమన్న పేరులోనే దాని లక్షణం ఇమిడిఉన్నది. రతిరహస్యమునందు పూత్కార లక్షణము భిన్నముగా చెప్పబడినది. చూ. రతిరహస్యం.

6. హింకృతము :- "హిక్" అను అక్షరములను ఉచ్చరించునపుడు జనించు ధ్వనివంటి ధ్వనియగుటచే దీనికి 'హింకృతము' అనిపేరు వచ్చినది.

రతివేళ భార్యలో ఒక తీవ్రాదేశము జనించి, ఆమె తన భర్తను ముద్దిడుకొనే వేగంలో ఈ హింకృతం పుడుతుంది. అనగా