పుట:NagaraSarwaswam.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130


శబ్దము ' టాత్ - టాత్ ' అన్నధ్వనికి సమీపంగాఉంటుంది. దీనియందు వ్రేళ్ళయొక్క స్థితి కత్తెరయొక్క స్థితి సన్నిహితంగా ఉంటుంది. పుట్టేశబ్దముకూడ కత్తిరింపుశబ్దాన్ని పోలిఉంటుంది. అందుచే దీనికీ పేరువచ్చినది.

2. ముష్టితాడనము : భార్యతో కలిసి రమించుచు భర్త తనచేతివ్రేళ్ళను పూర్తిగా గుప్పిడిగా మడచి ఆమెను తాడించినచో ఆ తాడనము 'ముష్టితాడనము' అనబడుతుంది. భార్యయొక్క పిరుదులు పృష్టము ఈ తాడనమునకు అర్హస్థానములై ఉన్నాయి. ముష్టి అనగా పిడికిలి. పిడికిలిలో చేయబడే తాడనమైనందున దీనికీ పేరువచ్చినది.


3. విద్ధకము : ఒకదెసగా ప్రయాణం చేస్తూవున్న వస్తువు (ఏకాంతికిరణమో) మరియొకదెసగా ప్రయాణంచేసే వేరొక వస్తువును (ఏకాంతికిరణమునో) ఢీకొనుట జరిగితే దానికి వేధ అనిపేరు. అట్టిదైన వేధాలక్షణముతో కొట్టుటకే విద్ధకమని పేరు. భర్త తనయొక్క కాలిబొటనవ్రేలితో భార్యయొక్క బుగ్గను వేధించుట విద్ధకము అనగా దీనికి భార్యయొక్క చెక్కిలిస్థానమనియు, పురుషుడు తనకాలి బొటనవ్రేలితో ఈతాడనం ఆచరించాలని గ్రహించాలి. కొన్ని సంభోగాసనములయందు భార్యయొక్క తొడలు పైకెత్తబడియుండగా పురుషుడామెను కూడువిధానములు చెప్పబడినవి. అట్టిస్థితియందు భార్య కొంత నిరుత్సాహముగాగాని, మరేకారణముచేతగాని తనముఖమును ఒకవంకకు వ్రాల్చియుంచుట సంభవించినచో - పురుషుడు సంభోగాసనమును వీడకయే ప్రయత్నపూర్వకముగా తనపాదము నామె ముఖము వద్దకు గొనిపోయి కాలి బొటనవ్రేలితో ఆమెముఖమును తనకు అభిముఖమగునట్లు మీటుట ' విద్ధకము ' అనబడుతుంది.

4. ఆదీపితము : ఆదీపితము అనగా అంతటను ప్రజ్వలింపసేయబడినది. పురుషుడు తన పిడికిలితో భార్యయొక్క సర్వశరీర