పుట:NagaraSarwaswam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


నాన్ని అంటివున్న భవనము తనకు తగిన భర్తను సంపాదించుకొనుటకై ఆమె యీ ప్రకటనను వ్రేలాడగట్టి ఏండ్లుదాటింది. ఇంతవరకు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వెళ్ళినవారెందరో ఆమెతోటలోపనిచేస్తున్నారు. అవేవో చిత్రమైన శాస్త్రప్రశ్నలు వానికి సమాధానం చెప్పడం అసంభవం. ఆ రాకుమారికి పెండ్లియే కాదేమో!"

ఇలా వున్నాయి జనం చెప్పేమాటలు, అజయుడు ఆలోచించికాని ఏపనీ చేయడు. అతడాభవన ద్వారం దగ్గఱ కావలియున్నవాని వద్దకు చేరి-నిన్న ఎవరైనా ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చినారా? అని అడిగేడు.

ఆఁ! వచ్చారుబాబూ! వారెవరో మీవలెనే వున్నారు. మొత్తం ముగ్గురు. ఇప్పుడు తోటలో పనిచేస్తున్నారు అన్నాడు.

ఇది విని అజయుడు ఆశ్చర్యపడ్డాడు. అతడాలోచించసాగాడు. నా సోదరు లిక్కడ చిక్కుకొన్నారన్నమాట. కాని ఇది సంభవమా! మా చదువని శాస్త్రములు లేవు. వారామె ప్రశ్నలకు తగు సమాధానములు చెప్పలేకపోయినారా? వారు చెప్పజాలకపోయిన నేను మాత్రము చెప్పగలనా? తమ్ములను విడిపించుట యెట్లు? ఇంతకు ఆమె యే శాస్త్రములో ప్రశ్నిస్తోంది? నవయువతి అగుటచే కామ శాస్త్రములో ప్రశ్నించునేమో! అందైనను సోదరులకు తెలియని విషయములు లేవే! అట్లుకాదు. యౌవ్వన మింకను బొడసూపకముందే కామశాస్త్రములు చదువుట మంచిదికాదని గురువులు నిషేదిస్తూ వాత్స్యాయన మహర్షి రచించిన కామ సూత్రములకు మాత్రమే బోధించారు. కామశాస్త్రములేకాక కామశాస్త్రగ్రంథములెన్నో వున్నవి. నేనుమాత్రము ఆ గ్రంథాలన్నీ తెప్పించి చదివేను. వారు చదువలేదేమో! ఈ రాకుమారి తప్పక కామశాస్త్రములోనే ప్రశ్నిస్తూవుండాలి. లేకపోతే నా తమ్ములను జయించడం ఈమెకు సాధ్యంకాదు. ఇప్పుడు నేనేమిచెయ్యాలి? ఆమె ప్రశ్నలకు సమాధానం చెపుతానని లోపలకువెళ్ళనా? మాననా? సమాధానం చెప్ప