పుట:NagaraSarwaswam.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120


రెండింటిని భర్తయొక్క వెన్నుపూస చివర కలిపియుంచినదై రమించుచో ఆస్థితి 'యుగ్మపాదము' అనబడుతుంది. యుగ్మము అనగా జంట. పాదములజంట ఇందేర్పడుచున్నది. అందుచే దీనికీ పేరువచ్చినది. రతిరహస్యమునందు బాడబక-వేష్టితబంధములు ఉత్తానకరణము నందు పేర్కొనబడ్డాయి. యుగ్మపాదము నాతడు దీనికి కొంత భిన్నమైన రీతిలో ఆసీనకరణములందు పేర్కొన్నాడు. చూ. రతిరహస్యం.

ఆశీనకరణ భేదములు

భార్య శయ్యపై కూర్చుండియుండగా భర్త ఆమెనుకూడి రమించుట ఆసీనకరణము. ఈ కరణమునందు భార్య నెమలి మున్నగువానివలె కూర్చుండగా పురుషుడామెను ముందునుండియే కాక వెనుకనుండి కలిసి రమించుటకూడ లోకమందున్నది. ఇక్కడ ఆశీనకరణభేదములందు 'లలితబంధము' అను ఒక్క బంధముమాత్రమే తెలుపబడుచున్నది.

1. లలితము :- యువతి శయ్యపై కూర్చుండియున్నది. పురుషుడామెకెదురుగా తానును కూర్చుండియే ఆమెను కలియుటకు సంసిద్ధుడయ్యెను. అప్పుడాయువతి తనతొడలను విడదీసియుంచి భర్తకు తావిచ్చుటయేకాక భర్తయొక్క వెన్నుపూస తుదిభాగమున తన యొక్క అందెలతో మెరసే పాదములనుజేర్చి, ఆతనిని తనకు మిక్కిలి సమీపముగా లాగుకొనెను. భర్తయు ఆమెకంఠమును గాఢముగా కౌగలించుకొని రతిక్రీడకు ఉపక్రమించెను. ఇదుగో ఇట్టి ఆసీనబంధము 'లలితము' అనబడుతుంది. ఆశీనకరణము లన్నింటియందును ఇది ఉత్తమమైనది.