పుట:NagaraSarwaswam.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

119

3. ముద్గకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించి - తన తొడలను దగ్గరగాచేర్చి - యోని ద్వారమును బిగించియుంచగా - పురుషుడామె కభిముఖుడై ప్రక్కవాటుగా శయనించి రమించు స్థితికి ముద్గకబంధమనిపేరు. సంపుటకబంధమున యోని ముఖము బిగింపబడియుండదు. దీనియందు బిగింపబడియుండును - అని గ్రహింపవలెను.

4. పరావృత్తకబంధము : యువతి శయ్యపై భర్తకు అభిముఖముగా కాక పెడమొగమై ప్రక్కవాటుగా శయనించి తన తొడలను దగ్గరగాజేర్చి యోనిముఖమును బిగించియుంచగా భర్త ఆమెను వెనుకనుండియే కూడి రమించుటకు పరావృత్తకమని పేరు.

5. వేష్టితకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియున్నదై - ఆస్థితియందు తనకభిముఖుడై శయనించి తన్ను గూడిన భర్తయొక్క పిక్కలతో తనపిక్కలను మెలివేయుట జరిగినచో అది 'వేష్టితకబంధము' అనబడుతుంది. 'వేష్టనము' అనగా చుట్టుట. పిక్కలను పిక్కలతో చుట్టుట యిందేర్పడును గాన దీనికి వేష్టితబంధమను పేరేర్పడెను.

6. బాడబకబంధము : ఆలుమగలు ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - స్త్రీ తన యోనిముఖముచే పురుషాంగమును బిగియ నొక్కినచో ఆ స్థితి 'బాడబికము' అనబడుతుంది. బడబ అనగా ఆడగుఱ్ఱము (ఆడగుఱ్ఱము రతివేళ ఇట్లాచరిస్తుంది) అందుచే దీనికీపేరువచ్చినది.

7. యుగ్మపాదము : ఆలుమగలు శయ్యపై ప్రక్కవాటుగా శయనించి రమించుచుండగా - వనిత తనయొక్క తొడ నొకదానిని భర్తయొక్క కటిభాగమునకు క్రిందుగాపోవనిచ్చి - వేరొకదానిని ఆతని కటిభాగమునకు పైనుండి పోవనిచ్చి తన పాదములను