పుట:NagaraSarwaswam.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

20. నాగపాశబంధము : యువతి శయ్యపై వెలికిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళదగ్గర మడచి, తిరుగ వానిని తొడలయొద్ద మడచి - తన మోకాళ్ళు తన స్తనములయొక్క పార్శ్వభాగములను తాకుచున్నస్థితిలో తన రెండుచేతులను తన రెండు మోకాళ్ళ సందులలోనుండియు రానిచ్చి - ఆ చేతులను రెంటిని తనయొక్క కంఠముయొక్క దిగువభాగమున ఉగ్గిలిపట్టుగా బంధించి యుంచినపుడు పురుషుడామెను కూడుట నాగపాశబంధ మనబడును. రతిరహస్యమునందీ బంధము భిన్నముగా చెప్పబడెను. చూ. రతిరహస్యం.

తిర్యక్కరణ భేదములు

భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా పురుషుడామెను కూడి రమించుట తిర్యక్కరణమనబడునని వెనుక చెప్పబడినది. ఈ స్థితియందేర్పడే ఉత్తమబంధ భేదములు ఏదు. అందు మొదటిది సంపుటబంధము.

1. సంపుటబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా భర్త ఆమె కభిముఖముగా ఆమెవలెనే ప్రక్కవాటుగా శయనించినవాడై ఆమెనుకూడి రమించుటకు 'సంపుటక బంధము' అనిపేరు. ఇందు ఆలుమగల శరీరములు ప్రక్కవాటుగా నున్నను సరళముగా చాచబడి యుండును. దీనిని రతిరహస్యకర్త 'ఉత్తానకరణ భేదములందు' 'పార్శ్వసంపుటక బంధము' అను పేరుతో పేర్కొనెను. చూ. రతిరహస్యం.

2. పీడితబంధము : ఆలుమగలు సంపుటబంధమునందువలెనే ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - భార్య తన తొడలతో భర్తయొక్క తొడలనునొక్కి పీడించుట జరిగినచో - ఆ స్థితి 'పీడితబంధము' అనబడుతుంది.