పుట:NagaraSarwaswam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


ఆ భవనం రాజభవనమంత పెద్దది. ఎత్తైన ప్రాకారపుగోడ, విశాలమైన ప్రవేశద్వారము ఆ భవన సౌందర్యాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. అజయుడాభవన ప్రాకార సమీపానికి వెళ్ళాడు. అక్కడ ద్వారసమీపంలో చలువరాతిమీద చెక్కబడిన ఒక ప్రకటనపై అతనిచూపు పడ్డది. అందులో ఇలా వ్రాయబడి వున్నది.

         ఐదే ప్రశ్నలు!
    ప్రశ్నలు శాస్త్రీయములే!
    సముచిత సమాథానము చెప్పగలిగితివా -
    రాకుమారి రత్నవదిక ఈ రాజ్యంతో నీకు పాదదాసి.
    నీ సమాధానములు తగినవి కానిచో-
         నీవామెకు తోటమాలివి.
                           -రాకుమారి రత్నవదిక,

అజయుడా ప్రకటన చదివేడు. అతడనుకొన్నాడు- ఇదేమి ప్రకటన! రాకుమారిక శాస్త్రములందు బ్రశ్నించునా? ఐదు ప్రశ్నలా! ఆ ప్రశ్నల కింతవరకు ఎవరును సమాధానము చెప్పలేకపోయిరా? ఏవో వికట ప్రశ్నలయినచో సమాధానము చెప్పజాలకపోవచ్చును. కాని శాస్త్రములందు చెప్పబడిన విషయములందే ప్రశ్నించినపుడు చెప్పకపోవుట యేమిటి! శాస్త్రములు చదివినవాడెవరైన చెప్పవచ్చునే! ఇంతకు నా సోదరులేమైనట్లు? వారిక్కడకువచ్చి చిక్కుకొనలేదుకదా! ఏమో! ఎవరు చెప్పగలరు?

ఇలా ఊహించుకొని అజయుడు వచ్చేపోయే జనాన్ని అడిగి కొంత వివరం తెలిసికొన్నాడు. అతనికి తెలియవచ్చిన విషయంఇది.

"రత్నవదిక చాల అందగత్తె, బుద్ధిమతి, విదుషి. ఆమెతండ్రి ఆమెకీరాజ్యం అప్పగించి చనిపోయాడు. మంత్రుల సాయంతో ఆమెయే యీ రాజ్యాన్ని పాలిస్తోంది. ఆమె నవయువతి, ఇది ఆమె వుద్యా